ఆ కాలేజీకి రూ.6.3 లక్షలు డొనేట్ చేసిన కెనడియన్ ఎన్నారై..

ఎన్నారైలు తాము పుట్టిన నేల కోసం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి తమ మంచి మనసులను చాటుకుంటున్నారు.తాజాగా కెనడియన్ ఎన్నారై ముఖ్విందర్‌పాల్ సింగ్ ఉప్పల్( Mukhwinderpal Singh Uppal ) పంజాబ్ రాష్ట్రం, సర్హాలి పట్టణంలోని గురు గోవింద్ సింగ్ ఖల్సా కళాశాలకు( Guru Gobind Singh Khalsa College ) ఏకంగా రూ.6.3 లక్షల విరాళాన్ని అందించారు.ఇది గ్రామీణ, వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే కో-ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్.ముఖ్విందర్‌పాల్ ఈ కాలేజీ సాధించిన విజయాలు, సవాళ్లను చూపించిన డాక్యుమెంటరీని చూశారు.దీనిని ప్రముఖ పాత్రికేయుడు జతీందర్ పన్ను విడుదల చేశారు.దీన్ని చూశాక ఏదో ఒక సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్విందర్‌పాల్‌కు వచ్చింది.

 Canadian Nri Donates Rs 6.3l To College Details, Donation, Mukhwinderpal Singh U-TeluguStop.com

దాంతో తన వంతుగా లక్షల రూపాయలు దానం చేసి కాలేజీ అభివృద్ధిలో చేయూతనందించారు.

Telugu Canadian Nri, Documentary, Donates Rs, Gurugobind, Jatinder Pannu, Santba

ఈ డాక్యుమెంటరీ కాలేజీ హిస్టరీ, దార్శనికతను హైలైట్ చేసింది, దీనిని 1970లో సర్హాలిలో( Sarhali ) అప్పటి కర్ సేవా విభాగం అధిపతి సంత్ బాబా తారా సింగ్ స్థాపించారు.సంత్ బాబా తారా సింగ్( Sant Baba Tara Singh ) ఒక గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకుడు, అతను దేశవ్యాప్తంగా వివిధ సిక్కు మందిరాల సంరక్షణ, పునరుద్ధరణకు దోహదపడ్డారు.నిన్న ముఖ్విందర్‌పాల్‌ క్యాంపస్‌ని సందర్శించి, కాలేజీ ప్యాట్రోన్, ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా ఉన్న సంత్ బాబా తారా సింగ్, అతని వారసులు సంత్ బాబా చరణ్ సింగ్, సంత్ బాబా సుఖా సింగ్‌ల కృషికి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

Telugu Canadian Nri, Documentary, Donates Rs, Gurugobind, Jatinder Pannu, Santba

ముఖ్విందర్‌పాల్‌ అందజేసిన విరాళంతో కళాశాలలోని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మరింత చక్కగా అభివృద్ధి చేయవచ్చు.ఇక విద్యారంగంలో మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా కెరీర్‌కు సంబంధించిన వివిధ కోర్సులను కాలేజీ అందిస్తున్నదని ఎన్నారై కొనియాడారు.తన విరాళం యువతకు నాణ్యమైన విద్యను అందించడం, ప్రపంచ అవకాశాలను ఎదుర్కొనేలా వారిని శక్తివంతం చేయడం అనే లక్ష్యాన్ని సాధించడానికి కాలేజీకి సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube