తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) లో బిజీపీ పోటీ నామ మాత్రమే అని ప్రధానంగా పోటీ బారాస కాంగ్రెస్ మధ్యలోనే అని నిన్నటివరకు విశ్లేషణలు వినిపించినా ఈ రోజు వస్తున్న ఫలితాలు చూస్తుంటే బాజాప ఆశించిన దానికన్నా ఎక్కువే వచ్చినవా అన్నట్టుగా ఉందని తెలుస్తుంది.ముఖ్యంగా ఎనిమిది శాతం నుంచి 14% వరకు బిజెపి ఓట్ బ్యాంకు పెరగటం , 9 స్థానాలలో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజ లో ఉండడం అన్నది భవిష్యత్ రాజకీయాల్లో ఆ పార్టీకి శుభ సంకేతం గానే భావించవచ్చు.
![Telugu Adilabad, Amith Shah, Bandi Sanjay, Congress, Etela Rajender, Ts Bjp, Ts- Telugu Adilabad, Amith Shah, Bandi Sanjay, Congress, Etela Rajender, Ts Bjp, Ts-](https://telugustop.com/wp-content/uploads/2023/12/telangana-Assembly-Elections-Adilabad-District-Etela-Rajender-bandi-sanjay-ts-bjp-ts-elections-congress-amith-shah.jpg)
ముఖ్యంగా అదిలాబాద్ జిల్లా( Adilabad District )లో నాలుగు ఎమ్మెల్యేలు గెలుచుకోవడం ఆ పార్టీకి తిరుగులేని ఉత్సాహం ఇస్తుందని చెప్పవచ్చు.అయితే కీలక నాయకులుఅయిన ఈటెల రాజేందర్,( Etela Rajender ) దర్మపురి అరవింద్, రఘునందన్ వంటి నేతలు వెనకంజ వేయడం ఆ పార్టీకి కొంత నిరుత్సాహం కలిగించేదే .పైగా ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఓటమి దిశగా కదలటం ఆ పార్టీని ఆందోళన పరుస్తుంది.అయితే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ముఖ్యంగా తెలంగాణ లో బారాసతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయన్న ప్రచారం తిరిగి తిప్పి కొట్టలేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోలేకపోవటం పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవడంలో ఢిల్లీ పెద్దలు సరయిన దిశ నిర్దేశం చేయకపోవడమే ఈ పరిస్తితి కి కారణం గా రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు .
![Telugu Adilabad, Amith Shah, Bandi Sanjay, Congress, Etela Rajender, Ts Bjp, Ts- Telugu Adilabad, Amith Shah, Bandi Sanjay, Congress, Etela Rajender, Ts Bjp, Ts-](https://telugustop.com/wp-content/uploads/2023/12/Adilabad-District-Etela-Rajender-bandi-sanjay-ts-bjp-ts-elections.jpg)
సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే భాజపా ఓటమి కి కారణాలుగా చెప్పవచ్చు.అయినప్పటికీ భవిష్యత్ రాజకీయాల్లో జండా ఎగరవేసే దిశగా ఈ ఫలితాలు బిజెపికి బూస్ట్ ఇస్తాయి అనడంలో మాత్రం ఏ రకంగానూ సందేహం లేదు .అంతేకాకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మిగిలిన రాష్ట్రాలను గెలిపించుకునే దిశగా మాత్రం భాజపా దూసుకెళ్తుంది ఇది మోడీ మానియా మరోసారి దేశంలో కనిపిస్తుంది అనడానికి సంకేతంగా చెప్పవచ్చు.