దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీకి షాక్ ఇస్తూ బీఆర్ఎస్ గెలుపొందింది.ఈ మేరకు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
సుమారు యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపును కైవసం చేసుకున్నారు.మొదటి రౌండ్ నుంచి చివరి వరకు ఆధిక్యతను కనబర్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి చివరకు విజయం సాధించారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.కాగా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఏడు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంగా కాంగ్రెస్ మూడు స్థానాల్లో ముందంజలో ఉంది.