తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు.ఈ మేరకు మరికాసేపట్లో ఈసీని కలిసి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇవ్వనున్నారు.
ఈ క్రమంలోనే పలు విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని వికాస్ రాజ్ కు అందజేయనున్నారు.రైతుబంధు నిధులను కేసీఆర్ మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
అలాగే కమీషన్ ల కోసం నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని పేర్కొంది.ప్రభుత్వ లెక్కలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయాలనే యోచనలో కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది.







