దేశంలో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛతీస్ గడ్, మిజోరాంలో పోలింగ్ ముగియగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ ముగియటం జరిగింది.
తెలంగాణ( Telangana ) మినహా మిగతా రాష్ట్రాలలో పలు దశలలో ఎన్నికలు జరిగాయి.కాగా తెలంగాణలో ఒకే ఒక దశలో నవంబర్ 30వ తారీకు పోలింగ్ జరిగింది.
అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో… డిసెంబర్ మూడో తారీకు ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) ప్రకటించడం జరిగింది.
కానీ లేటెస్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘం మిజోరం ఎన్నికల ఫలితాలు( Mizoram Elections Results ) డిసెంబర్ 4వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉండబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
మిగతా నాలుగు రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియ యధావిధిగా ఈ నెల 3న జరగనుందని ఈసీ స్పష్టం చేయడం జరిగింది.మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ 21.రావాలి.ఈ క్రమంలో మిజోరాంలో జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి స్పష్టమైన ఆదిక్యం రాకపోవటంతో మిజారాంలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.