రైతులు పంటను పండించడంలో మెళుకువలు పాటిస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.పంట చేతికి వచ్చాక కోతల సమయంలో కూడా కొన్ని మెళుకువలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటేనే నాణ్యమైన పంట పొంది మంచి గిట్టుబాటు ధరకు పంటను అమ్ముకోవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే కొందరు రైతులు( Farmers ) ఎంతో శ్రమించి అలసంద పంటను బాగా పండించి కోతల సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.అలసంద పంటల( Alasanda Crop ) కోతల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.
అలసంద పంట ఎక్కువగా వర్షాధారంగా సాగు చేస్తున్నారు.వర్షాలు కాస్త ఆలస్యమైనప్పుడు రైతులు అలసంద పంట వేయడానికి కాస్త ఆసక్తి చూపిస్తుంటారు.ఈ అలసంద పంట వేడితో కూడిన వాతావరణం లో బాగా పండుతుంది.చలి వాతావరణంలో అధిక దిగుబడి సాధించడం కష్టం.
అలసంద పంటను పచ్చికాయల కోసం పండిస్తున్నట్లయితే.పంట వేసిన 45 రోజుల తర్వాత క్రమంగా పచ్చికాయలు కోతకు రావడం జరుగుతుంది.

పచ్చికాయ ఎక్కువగా ముదరక ముందే కొస్తే మంచి నాణ్యత కలిగి మంచి ధర పలుకుతుంది.ఒక ఎకరంలో దాదాపుగా 40 క్వింటాళ్ల పచ్చి కాయల దిగుబడి పొందవచ్చు.ఇక అలసంద పంటను విత్తనాల కోసం( Seeds ) సాగు చేస్తే.ఈ పంటను 80 శాతం ఉండగానే కోయడం వలన కాయ బాగా ఎండిపోయి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
పంట కోతల తరువాత అలసంద కాయలను మూడు లేదా నాలుగు రోజుల వరకు పొలంలో లేదా విశాలమైన ప్రదేశంలో ఎండనివ్వాలి.

ఆ తరువాత పశువులతో తొక్కించడం లేదంటే ట్రాక్టర్ తో( Tractor ) తొక్కించి నూర్పిడి చేయాలి.నూర్పిడి అనంతరం ఆ గింజలను శుభ్రపరిచి, గింజలలో తేమ 9 శాతం కంటే మించకుండా గింజలను రెండు లేదా మూడు రోజులు ఎండలో ఆరబెట్టాలి.గింజలలో తేమశాతం ( Moisture ) ఎక్కువైతే పంట చెడిపోయే అవకాశం ఉంది.
ఆ తరువాత శుభ్రమైన గోని సంచులకు 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి ఆ సంచులలో ఈ గింజలను నింపి నిల్వ చేయాలి.నిల్వ చేసే ప్రదేశంలో గోడలకు ఎలాంటి రంధ్రాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.







