ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, మానవులకు మాత్రమే కాకుండా జంతువులకు కూడా ప్రమాదకరం. ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, కూల్ డ్రింక్ టిన్నుల వంటి వాటిని తెలుగు రోడ్ల మీద పడేస్తుంటారు.
వీటిని తినడమో లేదా వాటిలో చిక్కుకోవడం వల్ల మూగజీవులు బలవుతున్నాయి.తాజాగా ఆస్ట్రేలియాలో మానవులు పారేసిన ఒక ఎనర్జీ డ్రింకులో పాము చిక్కుకొని అల్లాడిపోయింది.
టాస్మేనియా( Tasmania )కు చెందిన ఓ స్నేక్ రెస్క్యూయర్( Snake rescuer ) ఈ సంగతి తెలిసి వెంటనే తన అనుభవంతో కూల్ డ్రింక్ టిన్నులో చిక్కుకుపోయిన పాముకు విముక్తి కలిగించాడు.

ఒకవైపు ఎండ, మరొకవైపు దాహం వల్ల ఆ పాము నీటి కోసం వెతుక్కుంటూ తిరుగుతూ చివరికి ఎనర్జీ డ్రింక్ బాటిల్లో మిగిలున్న రసం కోసం లోపల తలపెట్టింది.అయితే తల లోపల పెట్టగలిగింది కానీ బయటకు తీయలేకపోయింది.పాము ఇబ్బంది పడుతుంటే దాన్ని కొందరు స్థానికలు చూసి పాముల సంరక్షకుడికి కాల్ చేశారు తర్వాత అతడు వచ్చి దీనిని కాపాడాడు.

కాపాడే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు.బయటకు తీశాక పాము చాలా ఉపశమనంగా ఫీల్ అయింది.అప్పటికే చాలాసేపు అది ఎనర్జీ డ్రింక్ బాటిల్ లోపల ఉండిపోయింది.దానివల్ల బాగా అలసిపోయింది.ఈ పాము కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారాయి.ఆ సంరక్షణకుడిని చాలా మంది పొగొడుతున్నారు.
ప్రతి ఒక్కరూ మూగజీవుల పట్ల కనికరం చూపించే వాటిని కాపాడాలని కోరుతున్నారు.ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలు జంతువులు తినకుండా డస్ట్ బిన్స్‌లో మాత్రమే పడేయాలని కొందరు సూచిస్తున్నారు.







