నిన్న నాగార్జున డ్యామ్( Nagarjuna Sagar Dam ) లో 13వ గేటు వరకు స్వాదీనం చేసుకున్నామ్.దాని పై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.
తెలంగాణ లో ఒక పార్టీకి అనుకులంగా, ఉద్దేశపూర్వకంగా నిన్న గొడవ సృష్టించారని అంటున్నారు.తెలంగాణ ఎన్నికల వేళ కావాలనే జగన్ ఇదంతా చేయించారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
నిన్న మేము చేసింది న్యాయమైనది.ధర్మమైనది.
రాష్ట్ర విభజన సమయంలో కృష్ణనది నీటి పంపకాలు చేసింది.కృష్ణనది నీటి పంపకాల విషయంలో కృష్ణా రివర్ బోర్డు కి అప్పగించమని కేంద్రం కోరిన తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు.
నిన్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) కూడా ఇదే విషయాన్ని చెప్పారు.తెలంగాణ ప్రజలకు కూడా నిన్నజరిగిన దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాలి.చట్టపరంగా ఏపీ పరిధిలో ఉండాల్సిన 13వ గేట్ నిర్వాహణ తెలంగాణ తీసుకుంది.తెలంగాణ ప్రభుత్వం ఏపీ భూభాగంలో చెక్ పోస్ట్ లు పెట్టింది.
దీనికి కారణం చంద్రబాబు ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలే.ఏపీ భూభాగంలో ఉన్న ప్రాంతంలోకీ మాత్రేమే వెళ్ళాం.
సాగర్ నీటి విడుదల కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా?.తెలంగాణ దయతో ఏపీ లో రైతులకు( Farmers ) నీళ్లు ఇవ్వాలా?.విభజన చట్టంలో ఏపీ కి కేటాయించి భూభాగంలోకి మాత్రేమే ఏపీ పోలీసులు వెళ్ళారు.అది తప్పు అనే చెప్పే హక్కు ఎవరికి లేదు.
ఏపీ కి కేటాయించి 66శాతం నీటిని మాత్రమే మేము ఉపయోగించుకుంటున్నాం.మా హక్కుల్లో వేలు పెట్టడానికి తెలంగాణ ప్రయత్నిస్తుంది.
సాగర్ నీటి విషయంలో చంద్రబాబు( Chandrababu naidu ) ఫెయిల్ అయ్యారు.ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలతో మన హక్కులు మనం సాదించుకున్నాము.
ఎవరితో మా గొడవలు లేవు.మా హక్కు ప్రకారమే నిన్న నీళ్లు విడుదల చేసాం.
మా వ్యూహం ప్రకారమే సరైన సమయంలో డ్యామ్ పై మన హక్కులు సాధించుకున్నాం.ఏపీ హక్కుల సాధించినందుకు అందరూ అభినందించాలి.
ఎన్నికల కోసం చేయాల్సిన అవసరం మాకు లేదు.ఏపీ పోలీసుల మీద కేస్ పెట్టడం అన్యాయమైన చర్య…మా హక్కు ప్రకారమే నీళ్లు విడుదల చేసుకున్నాం.
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి.చంద్రబాబు అతర్గతంగా ఎవరికి మద్దతు ఇచ్చారు తెలంగాణ ప్రజలకు తెలుసు.
తెలంగాణలో మా పార్టీ పోటీ చేయలేదు.తెలంగాణ ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు.
అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.