మనిషి అన్నాక ఎంతో కొంత ఏదో ఒక దానిపై అమిత ఆసక్తి ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.కొందరికి ఏదైనా ఫుడ్ బాగా నచ్చితే వాటిని అదేపనిగా కొనుగోలు చేస్తూ తెగ తినడం మనం చూస్తూనే ఉంటాం.
మరికొందరు అతి తెలివితేటలు ఉపయోగించి ఒకటో రెండో వారికి నచ్చిన ఐటమ్స్ ను దొంగలించడం కూడా మనం అప్పుడప్పుడు వీడియోల రూపంలో చూస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఆస్ట్రేలియా( Australia ) దేశంలోని ఓ మహిళకు డోనట్స్ అంటే విపరీతమైన ప్రీతి ఉన్నట్లుంది.
ఆ ఇష్టంతో ఏకంగా ఆ మహిళ 40 వేల డాలర్లు విలువచేసే క్రిస్పీ క్రీం డోనట్స్( Krispy Kreme Donuts ) కలిగి ఉన్న ఓ వ్యానును దొంగలించేసింది.దీంతో ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.
ఎందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ లోని ఓ సర్వీస్ స్టేషన్లో( service station in Newcastle ) ఉంచిన వ్యాన్ ను ఓ మహిళ ఎత్తుకెళ్లింది.ఆ వ్యాన్ వివిధ అవుట్ లెట్స్ కు సంబంధించి పదివేల డోనట్స్ ను తీసుకు వెళుతుంది.తెల్లవారుజామున వ్యాన్ డ్రైవర్ బ్రేక్ కోసం సర్వీస్ స్టేషన్ వద్ద అతను ఆగినప్పుడు ఈ చోరీ జరిగింది.
వైట్ హ్యాండ్ బ్యాగ్, డార్క్ కలర్ డ్రెస్ ధరించి ఉన్నావు మహిళ ఈ పని చేసింది.అక్కడ లభించిన సీసీటీవీ ఫొటేజ్ పరంగా ఆ మహిళ వయస్సు 30 ఏళ్ల పైబడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇకపోతే పరిస్థితి ఇలా ఉండగా డోనట్స్ సంబంధించిన కంపెనీ వారు వారి రిటైలర్ కస్టమర్లకు క్షమాపణలు తెలిపి వీలైనంత త్వరగా మరో వ్యానులో డోనట్స్ ను పంపిణీ చేయడం జరిగింది.అంతేకాదు, పోలీసులు అలాగే వారికి సహకరించిన అత్యవసర సిబ్బందికి కృతజ్ఞతలు తెలపడానికి క్రిస్పీ క్రీమ్ యూనిఫామ్ ధరించిన వారికి అన్ని ఇన్ స్టోర్ కొనుగోళ్లపై ఏకంగా 50% డిస్కౌంట్ కూడా కంపెనీ ప్రకటించింది.ఇకపోతే దొంగలించిన మహిళను పట్టుకోవడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.