అనారోగ్యంతో ఉన్న ఓ మహిళకు మాయ మాటలు చెప్పి ఆమె కూతురిని ఓ పోరంబోకుకు ఇచ్చి పెళ్లి చేశాడు ఓ పెళ్లిళ్ల పేరయ్య.వివాహం తర్వాత తండ్రిలా చూడాల్సిన మామ కోడలిపైనే అత్యాచార ప్రయత్నం చేశాడు.
దీంతో ఆ యువతి తన తల్లి వద్దకు చేరింది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
పోలీసులు( Poilce ) తెలిపిన వివరాల ప్రకారం.అనంతపురం( Anantapur ) నగర శివారులో ఉండే ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి మగదిక్కు లేదు.
ఓ మహిళ తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.కూలి పనులు చేసి కూతురిని ఏడవ తరగతి వరకు చదివించింది.
ఆ మహిళ అనారోగ్యం బారిన పడడం వల్ల ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది.

అయితే చాకలి చౌడప్ప అనే పెళ్లిళ్ల పేరయ్య ఓ పోరంబోకు వ్యక్తి వద్ద భారీగా కమిషన్ తీసుకుని, అనారోగ్యం బారిన పడిన మహిళతో నీవు చనిపోతే నీ బిడ్డ భవిష్యత్తు ఏమిటని భయపెట్టాడు.తనకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉందని పెళ్లి కొడుకు చాలా మంచివాడు హిందూపురంలో ఒక పెట్రోల్ బంక్, 15 ఎకరాల భూమి, రూ.కోట్ల రూపాయల డబ్బు ఉందని ఆమెను పూర్తిగా నమ్మించాడు.

వరుడుది కంబదూరు మండలం పాలూరు గ్రామం అని, వరుడి పేరు హరికృష్ణ( Harikrishna ) అని చెప్పి పెళ్లిచూపులు సిద్ధం చేయించాడు.కానీ ఆ యువతి ఇప్పుడే పెళ్లి వద్దని ఎంత చెప్పినా బాలికను దబాయించి భయపెట్టారు.పెళ్లి సమయంలో పలు అనుమానాలు వ్యక్తం అయితే బాలిక వయసు 13 ఏళ్లు కాగా.19 ఏళ్లుగా మార్చేసిన ఆధార్ కార్డును చూపించి అందరినీ మభ్యపెట్టి, ఆగస్టు 27న పాపంపేటలోని రామాలయంలో వివాహం జరిపించారు.హరికృష్ణ హిందూపురంలో తనదిగా చెప్పుకున్న పెట్రోల్ బంకులోని కొత్త కాపురం పెట్టాడు.భర్త లేని సమయంలో మామ ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.ఈ విషయాన్ని బాలిక తన అత్తకు చెప్పినా ఆమె పట్టించుకోకపోవడంతో పుట్టింటికి వచ్చి తన తల్లితో మొరపెట్టుకుంది.ఆ తర్వాత హరికృష్ణ కుటుంబ సభ్యులంతా కలిసి ఆ తల్లి కూతుర్లపై దాడి చేశారు.
వారి నుండి తప్పించుకుని అనంతపురం వచ్చి పెళ్లిళ్ల పేరయ్యతో పాటు పెళ్లికి పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారందరినీ నిలదీస్తే వారు కూడా స్పందించలేదు.చివరగా ఆ తల్లి కూతుళ్లు అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులను ఆశ్రయించి తమకు చేసిన మోసం, తమపై చేస్తున్న అఘాయిత్యాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.







