సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు అందరూ కూడా తమ ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వర్క్ అవుట్ చేస్తూ ఎంతో శ్రద్ధ తీసుకుంటేనే షేప్ అవుట్ కాకుండా ఉంటారని తద్వారా వారికి సినిమా అవకాశాలు వస్తాయని భావించి పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు జిమ్ సెంటర్లలో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అనసూయ ( Anasuya ) కూడా భారీ స్థాయిలో వర్కౌట్( Work out) చేస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఈమె వెండితెర నటిగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ( Social media )వేదికగా ఈమె ఎలాంటి పోస్టులు చేసిన పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈమె చేసే పోస్టులు వివాదాలకు కూడా కారణం అవుతూ ఉంటాయని చెప్పాలి.ఇలా అనసూయ ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి.ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ జిమ్ లో చేసే వర్కౌట్ లకు సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేసారు.అయితే ఒక ఫోటోలో భాగంగా ఈమె తలకిందులుగా వేలాడి ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇలా అనసూయ తాళ్లతో కాళ్ళను పైకి కట్టి తలకిందులుగా వేలాడుతూ ఉన్నటువంటి ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి అనసూయ నవంబర్ 29, 2023 సరిహద్దులు దాటి ముందుకు వెళ్లిన రోజుగా గుర్తుండిపోతుందని రాసుకొచ్చారు.జిమ్లో వర్కౌట్లతో పాటు అనసూయ ఏరియల్ యోగ చేస్తారట.దాంతో పాటు లేత కొబ్బరికాయ తింటారట.
ఇలా అనసూయ తన జిమ్ వర్కౌట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి .దీంతో నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ ఈమె పోస్టుపై కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.తాజాగా ప్రేమ విమానం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.