టాలీవుడ్ యంగ్ హీరో హీరోయిన్లు కృతి శెట్టి, వైష్ణవవ్ తేజ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని వారి ఖాతాలో భారీ వేసుకున్నారు.బారి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది.
దీంతో ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కెరీర్ కు డోకా లేదని అవకాశాలు వరుసగా క్యూ కట్టడం ఖాయం అని అభిమానులు భావించారు.అయితే కెరియర్ పరంగా ఎటువంటి డోకా లేకపోయినప్పటికీ వీరిని ఒక శాపం మాత్రం వెంటాడుతుంది.
వైష్ణవ్ తేజ్ వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ అవేవి వైష్ణవ్ కు ప్లస్ కావడం లేదు.పైగా ఎంపికలో చేస్తున్న పొరపాట్లు తన స్థాయికి మించిన పాత్రలను తెచ్చి అవసరం లేని విమర్శలకు తావిస్తున్నాయి.కొండపొలం డిజాస్టరే అయినా ప్రయత్నలోపం లేని సినిమాగా చెప్పుకోవచ్చు.కానీ రంగ రంగ వైభవంగా, ఆదికేశవ( Aadikeshava ) రెండూ స్వయంకృతాపరాధాలే.స్క్రిప్ట్ చదివినా చాలు పరమ రొటీన్ అనిపించుకునే సబ్జెక్టులవి.అయినా సరే చేశాడు.
ఏమైంది.వారం తిరక్కుండానే వెనక్కు వచ్చే రేంజ్ లో ఫ్లాప్ అయ్యాయి.
నెక్స్ట్ ఎవరితో చేసినా కనీస బజ్ సంపాదించుకోవడం గగనమే.ఇక కృతి శెట్టికి ప్రారంభంలో ఇప్పుడు చూస్తున శ్రీలీల రేంజ్ లో స్టార్ డమ్ వచ్చింది.
శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు ( Shyam Singha Royn )లాంటి ఒకటి రెండు హిట్లు పడినా ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి.ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో శర్వానంద్ మూవీ ఒకటే ఉంది.అది కూడా ఆగుతూ సాగుతూ వెళ్తోంది.అలా వీరిద్దరి ఉప్పెన తర్వాత ఆ రేంజ్ లో హిట్ సినిమా ఒక్కటి కూడా పడటం లేదు.సినిమ అవకాశాలు వస్తున్నప్పటికీ ఎందుకో తెలియదు కానీ ఆ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు.