ఏపీలో ఎన్నికల షెడ్యూల్ పై గత కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ఏపీలో ఎన్నికలు మార్చి లోనే ఉంటాయనే ప్రచార తీవ్రంగా జరుగుతుంది.
దీనికి తగ్గట్లుగానే రాజకీయ పార్టీలు హడావుడి మొదలుపెట్టాయి.ప్రజల్లో తమ పార్టీ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి .ప్రజలకు దగ్గర అయ్యేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నాయి.నిత్యం జనాల్లో ఉంటూ జనాల సమస్యలను తెలుసుకునే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాయి.
ఎన్నికల్లో ఓట్లు తమ పార్టీ అభ్యర్థులకు పడేవిధంగా ముందుగానే అలర్ట్ అవుతున్నాయి. తాజాగా ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయి అనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) క్లారిటీ ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో తమకు తెలియదని, ఆ ఎన్నికలతో పాటు, ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి అని సజ్జల క్లారిటీ ఇచ్చారు .
ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారాల పై సజ్జల స్పందించారు.ఏపీ కి జగన్, చంద్రబాబు ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని సజ్జల అన్నారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను అసలు తాము లెక్కల్లోకి తీసుకోవడం లేదంటూ సెటైర్లు వేశారు.
ఏపీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని, అట్టడుగు వర్గాల ప్రజలు రాజకీయ సాధికారికత సాధించడమే జగన్ లక్ష్యం అని, ఆర్థిక వెనకపడుతనం పోగొట్టాలనే ఆలోచన లో జగన్ ఉన్నారని అన్నారు.కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారాలని అన్నారు.
భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న జగన్ కావాలా , లేక తాను ఇచ్చిన దాంతో సరిపెట్టుకోమనే చంద్రబాబు కావాలా అనేది ప్రజలే తేల్చుకోవాలని సజ్జల సూచించారు.ఎన్నికల సమయంలో చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని , ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని నమ్మితేనే ఓట్లు వేయమనే నాయకుడు జగన్ మాత్రమే అన్నారు .
ఇటువంటి వారిని రాజకీయాల్లో ఎప్పుడైనా చూసారా అని ప్రజలను ప్రశ్నించారు.అగ్రవర్ణాలతో పోటీపడి స్థాయికి వచ్చేలా బీసీలకు జగన్ చేయూత అందిస్తున్నారని , ఎన్నికల అప్పుడు చంద్రబాబు( Chandrababu Naidu ) నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని సజ్జల అన్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు.ఎవరికోసమో పనిచేసే పవన్ ను తాము అసలు లెక్కల్లోకే తీసుకోవడమే లేదంటూ సెటైర్లు వేశారు.