జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ( Comedian RP ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన ఈ కమెడియన్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు( Nellore Peddareddy Chepala Pulusu ) బిజినెస్ ద్వారా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం గమనార్హం.
ప్రస్తుతం ఈ బిజినెస్ ద్వారా ఆర్పీ కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.అయితే ఈ కమెడియన్ పెళ్లి పీటలెక్కడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఈరోజు వైజాగ్ లో( Vizag ) పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య ఆర్పీ వివాహం( RP Marriage ) జరిగింది.తన సీక్రెట్ మ్యారేజ్ గురించి ఆర్పీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమ్మాయిది వైజాగ్ అని గతేడాది మా నిశ్చితార్థం జరిగిందని ఆర్పీ పేర్కొన్నారు.మేము ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని నిశ్చితార్థం, తదితర కార్యక్రమాలకు సెలబ్రిటీలు, వీఐపీలు వచ్చారని ఆర్పీ అన్నారు.

ఈసారి కేవలం బంధుమిత్రుల సమక్షంలో మ్యారేజ్ చేసుకోవాలని వైజాగ్ ను ఎంచుకున్నానని ఆర్పీ( RP ) పేర్కొన్నారు.అందుకే పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచామని ఆర్పీ కామెంట్లు చేశారు.గత మూడేళ్లుగా ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న( RP Lakshmi Prasanna ) లవ్ చేసుకున్నారు.ఆర్పీ నిశ్చితార్థానికి ధనరాజ్, మరి కొందరు కమెడియన్లు హాజరు కావడం జరిగింది.
ఆర్పీ లక్ష్మీప్రసన్న జోడీ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ షోలోకి( Jabardasth ) ఎప్పటికీ రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని ఆర్పీ అన్నారు.జబర్దస్త్ షో ఫుడ్ విషయంలో ఆర్పీ చేసిన కామెంట్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫ్రాంఛైజ్ ద్వారా ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు.
కాస్ట్ ఎక్కువగా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నా ఆర్పీ ఆదాయం మాత్రం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.కిర్రాక్ ఆర్పీ కామెడీ టైమింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.








