యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు కేవలం తెలుగు లోనే స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ మార్కెట్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్ కు చేరుకుంది.
దీంతో ప్రభాస్ లైనప్ ఇప్పుడు భారీ పాన్ ఇండియన్ సినిమాలతో నిండిపోయింది.మరి ఈ ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ”సలార్”( Salaar ) అనే చెప్పాలి.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

ఇక తాజాగా ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టోరీ లీక్ ( Salaar storyline ) చేసారు.ఇద్దరు ప్రాణ స్నేహితులు కొన్ని కారణాల వల్ల బద్ధ శత్రువులుగా మారుతారని కాగా వారి మధ్య సాగే కథనే సలార్ కథ అంటూ చెప్పి అందరిని సర్ప్రైజ్ చేసాడు.ఎన్నో హృద్యమైన ఎమోషన్స్ తో ఈ సినిమా సాగుతుందని యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయని ఇప్పుడు మొదటి పార్ట్ లో సగం కథ అలాగే రెండవ పార్ట్ లో మరో సగం కథ వస్తుందని తెలిపారు.

ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చాయి.ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.
హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.







