నంద్యాలలో చాలా రోజులగా జరుగుతున్న గ్రూప్ వార్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) .చాలా రోజులుగా నంద్యాల సీటు కోసం ఇటు భూమా కుటుంబం నుంచి భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్తు విఖ్యాత రెడ్డి( Jagattu Vikhyata Reddy ) మరియు మాజీ ఎమ్మెల్యే భూమా కుటుంబానికే చెందిన భూమా బ్రహ్మానంద రెడ్డి( Bhuma Brahmananda Reddy ) తో పాటు మాజీ మంత్రి ఫరూక్ కూడా తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఇటీవల యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా ఈ వర్గాలు లోకేష్ ముందు బలప్రదర్శనకు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి .దాంతో టికెట్ ఎవరికీ ఇచ్చినా వర్గ పోరాటాలు తప్పవనే పరిస్థితులు కనిపించాయి.
అయితే ఎటకేలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోక్యంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ఒక ప్రకటనలో మాజీ మంత్రి ఎండి ఫరూక్ ( Former minister MD Farooq )ని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా నియమించడంతో నంద్యాల రాజకీయాల్లో భూమ శకానికి ఎండ్ కార్డ్ పడినట్లే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మైనారిటీ నేత కావడంతో పాటు బీసీల మద్దతు కూడా ఉండడంతో శిల్ప కుటుంబానికి గట్టి పోటీ ఇస్తారని టిడిపి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.భూమా బ్రహ్మానంద రెడ్డికి తొలి విడతలోనే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
మరి గత రెండు రోజులుగా తన అభిమానులతోనూ , పార్టీ శ్రేణులతోనూ భేటీ అయి చర్చలు జరుగుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారా లేక పార్టీ మార్పు పరిశీలిస్తారా అన్నది ఆసక్తికరంగా మారగా మరోవైపు భూమా అఖిల ప్రియ( bhuma akhila priya ) వర్గానికి కూడా ఇది గట్టి దెబ్బ గానే తెలుస్తుంది.తన తండ్రి తన తల్లిదండ్రుల వారసత్వంగా వస్తున్న స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ని భూమా అఖిలప్రియ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.