టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు బెయిల్ రద్దుపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
17ఏ తీర్పు తరువాత బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ క్రమంలోనే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు చంద్రబాబుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి మాట్లాడకూడదని తెలిపింది.ఇరుపక్షాలు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.