ఉదయం నిద్ర లేవగానే శరీరమంతా నొప్పులు గా ఉందా..? దానికి కారణం ఏంటో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం సమయంలో నిద్ర లేవగానే కొంత మందికి శరీరంలోని అన్ని భాగాలు నొప్పిగా అనిపిస్తాయి.ఏదైనా కండరాల నొప్పి తీవ్రమైన తలనొప్పి లేదా శరీరం నొప్పి అనుభవిస్తే ఏ పని కూడా చేయకూడదు.

 Does Your Whole Body Aches When You Wake Up In The Morning? Do You Know The Rea-TeluguStop.com

ముందుగా విశ్రాంతి తీసుకోవాలి.ఆ తర్వాతే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.

నిద్ర లేచిన తర్వాత నొప్పికి చాలా కారణాలు ఉంటాయి.వాటిలో నిద్రలేమి లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి.

నిద్రలేవగానే నొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో తగినంత విటమిన్ D( Vitamin D ) లేకపోవడం వలన హైపోకాల్సెమియా లేదా తక్కువ కాల్షియం ఉండడం వల్ల ఇలా ఒళ్లంతా నొప్పులు ఉంటాయి.

మన కిడ్నీలు, కండరాలు వంటి శరీరంలోని ఎన్నో ముఖ్యమైన అవయవాలు తమ విధులను సరిగ్గా నిర్వహించడానికి క్యాల్షియం చాలా అవసరం ఉంటుంది.

Telugu Anemia, Aches, Eggs, Fruits, Tips, Milk, Red, Vitamin-Telugu Health Tips

మన కిడ్నీలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా కాల్షియం చాలా అవసరం.అలాగే మన శరీరం క్యాల్షియమును గ్రహించడానికి మనకు తగినంత విటమిన్ D కూడా చాలా అవసరం.ఈ విటమిన్ లోపం వలన కొన్ని శరీర అవయవాలలో, ఎముకలలో నొప్పి వస్తుంది.

అలాగే మన శరీరంలోని ఎర్ర రక్తకణాలు( Red blood cells ) సరిగా పని చేయలేనప్పుడు కూడా రక్తహీనత వస్తుంది.అలాగే మన శరీర కణజాలలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వలన కూడా ఇలా జరుగుతుంది.

రక్తహీనత ( Anemia )మన శరీరంలోని అనేక భాగాలను బలహీన పరుస్తుంది.కాబట్టి శరీరం మొత్తం నొప్పిగా అనిపిస్తుంది.

ఇక రక్తహీనత అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి లేదా సరిగ్గా పని చేయడానికి తగినంత ఆక్సిజన్ లభించదు.
ఉదయం నిద్ర లేవగానే శరీరమంతా నొప్పులు గా ఉందా.? దానికి కారణం ఏంటో తెలుసా.?

Telugu Anemia, Aches, Eggs, Fruits, Tips, Milk, Red, Vitamin-Telugu Health Tips

ఈ రక్తహీనత యొక్క ఇతర లక్షణాలు అలసట, అసాధారణ హృదయ స్పందన, మైకము, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి.అంతేకాకుండా అధిక బరువు, వీపు మెడ పై ఒత్తిడిని కలిగిస్తాయి.దీని వలన చాలా శరీర భాగాల్లో నొప్పి వస్తుంది.

అధిక బరువుOverweight వల్ల నిద్ర, శ్వాస సమస్యలు కూడా వస్తాయి.ఇది నిద్రనీ ప్రభావితం చేస్తాయి.

ముఖ్యంగా మేల్కొన్న తర్వాత నొప్పి కనిపిస్తుంది.కాబట్టి బరువు తగ్గడం కూడా చాలా ముఖ్యం.

అలాగే నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరచుకోవాలి.అంతేకాకుండా కాల్షియం లభించే పదార్థాలను అంటే పాలు, పండ్లు, గుడ్లు లాంటివి తీసుకోవడం చాలా అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube