జీరో నుంచి మొదలుపెట్టింది.. నేడు 1000 కోట్ల సంపాదన.. దేవిత సరఫ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

చాలామంది వ్యాపార కుటుంబాలకు చెందిన వారు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ సాధిస్తుంటారు.కొంతమంది మాత్రం జీరో నుంచి కెరీర్ ను మొదలుపెట్టి ఊహించని స్థాయికి ఎదుగుతారు.

 Devitha Saraf Inspirational Success Story Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

సొంతంగా ఏదైనా సాధించి సత్తా చాటుతారు.అలా జీరో నుంచి మొదలుపెట్టి సక్సెస్ అయిన వాళ్లలో దేవిత సరఫ్( Devitha Saraf ) కూడా ఒకరు.

దేవిత సరఫ్ 1981 సంవత్సరం జూన్ నెల 25వ తేదీన ముంబైలో జన్మించారు.

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బీఏ పూర్తి చేసిన దేవిత సరఫ్ 24 సంవత్సరాల వయస్సులోనే టీవీలను తయారు చేయడానికి కంపెనీని మొదలుపెట్టారు.

దేవిత సరఫ్ తండ్రి పేరు రాజ్ కుమార్ సరఫ్( Raj Kumar Saraf ) కాగా ఆయన కంప్యూటర్స్ బిజినెస్ చేసేవారు.తండ్రి బిజినెస్ వల్ల టెక్నాలజీలో నైపుణ్యం సంపాదించుకున్న దేవిత తర్వాత రోజుల్లో బిజినెస్ లో ఉన్న చిక్కులను తెలుసుకున్నారు.

కాలిఫోర్నియాలో ( California )చదువుకున్న తర్వాత ఇండియాకు వచ్చి వియు గ్రూప్ ( Viu Group )పేరుతో టీవీలను తయారు చేసే కంపెనీని మొదలుపెట్టారు.ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ 1000 కోట్ల రూపాయలు కాగా ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ లలో అత్యధికంగా అమ్ముతున్న బ్రాండ్ ఇదే కావడం గమనార్హం.అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళ జాబితాలో ఒకరిగా నిలుస్తున్నారు.

దేవిత సక్సెస్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండగా రాబోయే రోజుల్లో ఈ కంపెనీ టర్నోవర్ మరింత పెరిగి దేవిత మరింత సక్సెస్ అవుతుందేమో చూడాల్సి ఉంది.చిన్న వయస్సులోనే సక్సెస్ సాధించిన దేవిత సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.ఆమె మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దేవిత సరఫ్ తన బ్రాండ్ ద్వారా ఇతర ప్రముఖ కంపెనీల బ్రాండ్ లకు గట్టి పోటీ ఇస్తున్నారు.దేవిత సరఫ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube