డైరెక్టర్ గోపీచంద్ మలినేని ( Gopichand malineni )డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఈ క్రమంలోనే ఆయన రవితేజ( Ravi Teja )తో చేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో వీళ్ల కాంబో లో హ్యాట్రిక్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఇకదానితో ప్రస్తుతం నాలుగో సారి రవితేజతో సినిమా చేయాలని గోపీచంద్ మలినేని రవితేజ కి స్క్రిప్ట్ చెప్పి ఓకే చేయించుకొని ఇద్దరు కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.అయిన కూడా ఈ సినిమా అనేది ముహూర్తం జరుపుకున్నప్పటికీ షూటింగ్ మాత్రం జరగకుండా ఆగిపోయింది.

ఇక దీనికి కారణం ఏంటి అంటే ఓవర్ బడ్జెట్ అవడం వల్లే ప్రస్తుతానికి మైత్రి వాళ్ళు ఈ మూవీని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఉంటుందా.? లేదా.? అనే విషయం పక్కన పెడితే గోపీచంద్ మలినేని కి ప్రస్తుతం మరో బంపర్ ఆఫర్ తగిలింది.అది ఏంటి అంటే ఇంతకుముందు వీర సింహారెడ్డి సినిమా( Veera Simha Reddy ) సక్సెస్ అయిన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ గోపిచంద్ మలినేని పిలిచి కంగ్రాట్స్ చెప్పడమే కాకుండా ఒక మంచి కథ ఉంటే తనకి వినిపించమని కూడా చెప్పినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు గోపీచంద్ మలినేని రజనీకాంత్( Rajinikanth ) కి ఒక కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.ఇంక దాంతో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కోలీవుడ్ మీడియా అనేక కథనాలను రాస్తుంది.ఇది కనక వర్క్ ఔట్ అయితే గోపీచంద్ మలినేని బంపర్ ఆఫర్ కొట్టినట్టే అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… మరి ఈ సినిమా వర్క్ ఔట్ అయితే గోపిచంద్ మలినేని ఒక బంపర్ హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నారు అలాగే ఈ సినిమా తో హిట్ కొడితే ఈయన టాప్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందుతారు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…
.







