మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టినటువంటి నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె వరుణ్ తేజ్ ( Varun Tej )తో కలిసి మిస్టర్ సినిమాలో నటించారు.
ఈ సినిమా సమయంలోనే ఈయనతో ప్రేమలో పడ్డారు.ఇలా మిస్టర్ సినిమా సమయం నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూ ఈ ప్రేమ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తపడ్డారు.
ఇక వీరిద్దరూ కూడా నవంబర్ 1వ తేదీ ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పెళ్లి తర్వాత తన సినిమా పనులలో బిజీగా ఉండగా లావణ్య త్రిపాఠి ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు.
ఇకపోతే ఈమె పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించబోతున్నారని తెలుస్తుంది.ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా ఈమె నలుపు రంగు స్లీవ్ లెస్ వెస్ట్రన్ వేర్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు అయితే ఈమె తన భర్త వరుణ్ తో కలిసి ఫోటోలు దిగారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈమె మెడలో తాళి లేకపోవడంతో పలువురు ఈ విషయంపై ట్రోల్ చేస్తున్నారు.పెళ్లి జరిగి నెల కూడా కాలేదు అప్పుడే తాళి తీసేసావా అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇక ఈ ఫోటోలపై మరికొందరు కామెంట్లు చేస్తూ అప్పుడే గ్లామర్ షో చేయడం మొదలు పెట్టావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి జరిగిన వెంటనే చాలా పద్ధతిగా డ్రెస్ ధరించి హైదరాబాద్ వచ్చినటువంటి ఈమె పెళ్లి జరిగి నెలరోజులు కూడా కాకముందే ఇలా మెడలో తాళిబొట్టు కూడా తీసేసి తిరగడంతో భారీ స్థాయిలో ఈమెపై ట్రోల్స్ చేస్తున్నారు.

ఇకపోతే లావణ్య త్రిపాఠి షేర్ చేసినటువంటి ఈ ఫోటోలను కనుక చూస్తే ఈమె పెళ్లికాకముందే ఈ ఫోటోలను దిగారని స్పష్టంగా అర్థం అవుతుంది.దీంతో మరికొందరు ఇవి పెళ్లికి ముందు చేయించుకున్న ఫోటోషూట్ అని నిజానిజాలు తెలియకుండా ఇలా మాట్లాడటం తప్పు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఫోటోలలో ఉన్నటువంటి బ్యాక్ గ్రౌండ్ చూస్తే కనుక ఇది ఇటలీలో పెళ్లికి ముందు జరిగిన ఫోటోషూట్ అని స్పష్టంగా అర్థమవుతుంది.
పెళ్లికి ముందు జరిగిన ఫోటో షూట్లలో తాళిబొట్టు ఎలా ఉంటుందని మెగా ఫాన్స్ లావణ్య గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.ఏది ఏమైనా ప్రస్తుతం లావణ్యకు సంబంధించిన ఈ ఫోటోలు అవుతున్నాయి.







