యజమాని తిడితే అలిగిన కుక్క.. ఓదార్చిన బామ్మ.. హార్ట్‌టచింగ్ వీడియో వైరల్...

చాలామంది కుక్కలను ఎంతో ఆప్యాయంగా పెంచుతూ వాటికి ఫుడ్డు, బెడ్ అందిస్తుంటారు.ఇటీవల కాలంలో వాటితో ఆనందకరమైన క్షణాలను వీడియో రికార్డ్ తీసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు.

 The Dog Who Was Scolded By The Owner.. The Grandmother Consoled.. Heart Touchin-TeluguStop.com

తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.ఒక బామ్మ, ఆమె కుక్క మధ్య ప్రేమను వీడియో చూపిస్తోంది.

ఈ హార్ట్ టచింగ్ వీడియో ఆన్‌లైన్‌ యూజర్లు బాగా ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రకారం, ఒక బామ్మ తన బీగల్ కుక్క( Beagle dog )ను దాని యజమానులు తిట్టిన తర్వాత తన ఒడిలో పడుకోబెట్టుకొని ఓదార్చింది.

బామ్మ కుక్క బొచ్చును నిమిరుతూ, అది గుడ్ బాయ్ అని భరోసా ఇస్తుంది, కుక్క రిలాక్స్ అవుతూ ఆ ముసలావిడ ప్రేమను ఆస్వాదిస్తుంది.

వీడియోపై వ్యూయర్స్‌ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, వారు బామ్మ దయను, కుక్క అందమైన రూపాన్ని ప్రశంసించారు.ఈ వీడియో తమను ఎలా నవ్వించిందని, భావోద్వేగానికి గురి చేసిందని చాలా మంది వ్యాఖ్యానించారు.మనుషులు, జంతువుల మధ్య ప్రత్యేకించి కుక్కల మధ్య ఉండే ప్రత్యేక బంధానికి ఈ వీడియో నిదర్శనం.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

సాధారణంగా, కుక్కలు ఒంటరిగా( Dog ) నివసించే లేదా వృద్ధులకు తోడుగా ఉంటాయి.కుక్కలు వృద్ధుల ఆరోగ్యం, శ్రేయస్సును కూడా మెరుగుపరుస్తాయి, ఎందుకంటే అవి ఒత్తిడి స్థాయిలు, రక్తపోటు, హార్ట్ బీట్ రేటును తగ్గించగలవు.ప్రజలను సంతోషపరిచే హార్మోన్లు అయిన ఎండార్ఫిన్‌లను పెంచుతాయి.

కుక్కలతో సంభాషించడం వృద్ధుల మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube