రేవంత్ రెడ్డి పై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఎన్నికల ( Telangana Elections )ప్రచారం చివరి దశకు చేరుకోనుంది.నవంబర్ 28వ తారీకు ప్రజారానికి చివరి తేదీ కావటంతో బీజేపీ, కాంగ్రెస్ ( BJP Congress )జాతీయ పార్టీల నేతలు భారీ ఎత్తున తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

 Bjp Leader Gvl Narasimha Rao Serious Comments On Revanth Reddy Telangana Elect-TeluguStop.com

ముఖ్యంగా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ప్రధాని మోదీ, అమిత్ షా ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించడం జరిగింది.ఇక ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదే రీతిలో ఏపీ బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.

దమ్ముంటే రేవంత్ రెడ్డి.బీసీ సీఎం ప్రకటన చేయాలని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ భూ బకాసుర పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ బీసీ సీఎం నినాదంతో నిశ్శబ్ద విప్లవం మొదలైందని పేర్కొన్నారు.

బీసీలు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు.మళ్లీ వందేళ్లయిన అవకాశం రాదన్నారు.

జరగబోయే ఎన్నికలలో ఊహకందని ఫలితాలు వస్తాయని తెలిపారు.బీఆర్ఎస్ అవినీతిపై.

పూర్తిస్థాయి శిక్ష పడాలంటే జరగబోయే ఎన్నికలలో బీజేపీని గెలిపించాలని ప్రజలకు జీవీఎల్ నరసింహారావు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube