భార్య చేతబడి చేసిందేమో అనే అనుమానంతో క్షణికావేశంలో భార్య తలపై సిలిండర్ తో బాది భర్త హతమార్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా( Mahabubnagar District )లోని పెంట్లవెల్లిలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.జటప్రొల్ గ్రామానికి చెందిన యాదగిరి( Yadagiri ) అనే వ్యక్తికి కల్వకోల్ కు చెందిన సువర్ణ(32) అనే మహిళకు పదేళ్ల క్రితం వివాహం కాగా.వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం.వీరు హైదరాబాదులో జీవనం సాగించేవారు.భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో పెద్దలు జోక్యం చేసుకొని ఇరు కుటుంబ సభ్యులకు ఈ దంపతులకు సర్ది చెప్పారు.అయితే ఐదు నెలల కిందట మళ్లీ ఈ దంపతుల మధ్య గొడవ జరగడంతో సువర్ణ తన పిల్లలతో కలిసి జటప్రొల్ కు వచ్చి, కూలి పనులు చేసుకుంటూ పిల్లలను స్థానిక పాఠశాలకు పంపించేది.

శుక్రవారం తెల్లవారుజామున యాదగిరి జటప్రొల్ కు వచ్చి ఇంట్లో భార్యతో గొడవకు దిగాడు.తన తమ్ముడికి పెళ్లి కాకుండా, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండకుండా చేతబడి చేయించావా అంటూ భార్యను విచక్షణారహితంగా చితకబాదాడు.తీవ్ర ఆగ్రహానికి లోనైన యాదగిరి విచక్షణా జ్ఞానం కోల్పోయి పక్కనే ఉన్న సిలిండర్ తో భార్య తలపై బలంగా బాదాడు.తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య సువర్ణ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.
ఈ విషయాన్ని పెద్ద కుమార్తె చుట్టుపక్కల ఉండే స్థానికులకు, పోలీసులకు( Police ) తెలియజేసింది.యాదగిరి ఇద్దరు పిల్లలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లోంగిపోయాడు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయం బంధువులకు తెలియడంతో నిందితుడిని కఠినంగా శిక్షించి, పిల్లలకు న్యాయం చేయాలని పోలీసుల ముందు వాగ్వాదానికి దిగారు.
ఈ హత్య ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.







