అమ్మను మించిన దైవం లేదని పెద్దలు చెబుతారు.అమ్మ ( Mother ) ఎక్కడుతున్నా పిల్లల విషయంలో ప్రేమగా వ్యవహరిస్తుంది.
పిల్లల కోసం ఎంతైనా కష్టపడుతుంది.పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి హృదయం అస్సలు తట్టుకోలేదు.
ఆకలితో ఏడుస్తున్న ఖైదీ కూతురికి లేడీ పోలీస్( Lady Police ) పాలివ్వగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ పోలీసమ్మను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో( Kochi ) చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.నాలుగు నెలల శిశువు ఆకలితో ఏడుస్తుంటే పోలీస్ అధికారి ఎం.ఏ.ఆర్య( M.A Arya ) క్షణం కూడా ఆలోచించకుండా ఆ చిన్నారి ఆకలి తీర్చి మంచి మనస్సును చాటుకున్నారు.పాట్నాకు చెందిన బిడ్డ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆ బిడ్డ తండ్రి జైలులో ఉన్నారు.
ఆ పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేరని తెలిసి కొచ్చి మహిళా స్టేషన్ కు ఆ పిల్లలను తీసుకొచ్చారు.

తల్లి దూరమైన చిన్నారి ఆకలితో అలమటించడంతో పోలీస్ అధికారి ఆర్య తల్లి మనస్సు చాటుకున్నారు.ఆ శిశువుకు( Baby ) కడుపు నింపి ఆర్య నిద్రపుచ్చారు.బిడ్డ ఆకలి తనకు తెలుసని తనకు కూడా తొమ్మిది నెలల చిన్నారి ఉందని ఆమె కామెంట్లు చేశారు.
నగర పోలీసులు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మిగతా ముగ్గురు పిల్లలను చైల్డ్ కేర్ హోమ్ కు తరలించారు.

ఎం.ఏ ఆర్య చేసిన పనికి సామాన్యుల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.రెమ్య రుద్ర భైరవ్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియోను షేర్ చేయగా ఈ వీడియో ఎంతో ఆకట్టుకుంటోంది.ఆర్య లాంటి మంచి మనస్సు ఉన్న పోలీస్ అధికారులు చాలా అరుదుగా ఉంటారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







