తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని( Bigg Boss contestant Ashwini ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ హౌస్ లోకి అశ్విని వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక హౌస్ లో తన అంద చందాలతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది.కాగా అశ్విని బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందు అమీర్ పేటలో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈమె నటించిన ఈ సినిమాలు ఎప్పుడు థియేటర్ లోకి వచ్చాయి ఎప్పుడు వెళ్లాయి అన్న విషయం కూడా తెలియదు.కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మెప్పించింది.
గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ కూడా షేర్ చేసుకుందట.గబ్బర్ సింగ్ సినిమాలో ఈమె ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నారా.
సినిమాలో ఒక సన్నివేశంలో చపాతి పిండి పిసికే సీన్ లో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తుంది.అందులో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని చూస్తూ చపాతి పిండిని తెగ పిసికేస్తూ ఉంటుంది.
అయితే మూవీలో స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్‌పై ఎంత ఇష్టాన్ని చూపిస్తుందో ఆఫ్ స్క్రీన్ లో కూడా అంతకు మించిన ఇష్టాన్ని పెంచుకుంది ఈ బ్యూటీ.సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌తో ఎదురైన అనభూతుల్ని పంచుకుంది అశ్విని.
ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ నా ఫేవరేట్.
అతని స్టైల్ గురించి అందరూ చెప్తుంటారు.ఆయన పెద్ద హీరో అని ఇష్టాన్ని పెంచుకోలేదు.
ఆయనతో వర్క్ చేసిన తరువాతే నేను ఆయనకి ఫ్యాన్‌ని అయ్యాను.మనుషులు ఇలా ఉంటారా? అని అనిపించింది.సార్ సెట్స్‌లో నాతో చాలా బాగా ఉండేవారు.
ఆయన తినే డ్రై ఫ్రూట్స్( Dry fruits ) నాకు ఇచ్చేవారు.అశ్విని కమాన్ అని అనేవారు.ఆయనతో గడిపిన క్షణాలు నాకు చాలా స్వీట్ మెమొరీస్.
ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.అశ్విని పాట పాడమ్మా అనేవారు.
ఆయన చాలా ఫన్‌గా ఉంటారు.ఆయన నేను క్యారివాన్‌లో ఉండేవాళ్లం.
షూటింగ్‌కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు.మిగిలిన టైం అంతా క్యారివాన్‌లోనే.
అలా నాలుగైదు రోజులు షూటింగ్‌కి పిలిచేవారు కాదు.క్యారివాన్‌లో సార్‌తో పాటే ఉండేదాన్ని.
టైంకి తినడం కబుర్లు చెప్పుకోవడం ఊరికే ఫోన్లు చూసుకోవడం చేసేదాన్ని.నాకు ఎక్కువ టైం క్యారివాన్‌లో బోర్ కొడుతుందని సార్ నేను వెళ్లి కారులో కూర్చుంటా అని చెప్పాను.
అప్పుడు ఆడెవడన్నా.ఈడెవడన్నా సాంగ్ షూట్ నడుస్తుంది.
నేను కారులో ఉండిపోయాను.ఎండ మండిపోతుంది.
దాదాపు 800 మంది ఆర్టిస్ట్‌లతో పాటు పవన్ కళ్యాణ్ సార్ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు.
అప్పుడు నాకు ఎంత భయం వేసిందంటే సార్ తిట్టేస్తారేమో అని భయపడ్డాను.కో డైరెక్టర్‌లు వచ్చి తిట్టారు.భయపడుతూనే సార్ దగ్గరకు వెళ్లి సార్ సారీ అని అన్నాను.
దానికి ఆయన.ఇట్స్ ఓకే అశ్వినీ ఫస్ట్ నువ్ చిల్ అవ్వు.సైలెంట్‌గా ఉండు అని సార్ నన్ను కూల్ చేశారు.ఆ సీన్‌తో ఆయనలో నాకు దేవుడు కనిపించారు.ఆయన్ని గాడ్ అని అంటారు ఇందుకేనేమో అనిపించింది.ఆయన్ని దగ్గర నుంచి చూశాను.
ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను అని చెప్పుకొచ్చింది అశ్విని
.