నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో పోస్టర్ల కలకలం చెలరేగింది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బోధన్ పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెలిసిన ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి.బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దేనని.
తమ బిడ్డలను చంపింది కాంగ్రెస్ అని పోస్టర్లలో రాసి ఉంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కర్ణాటకలో కరెంట్ కష్టాలు, నిరుద్యోగాన్ని కూడా పోస్టర్లలో ఎండగట్టారు.రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పోస్టర్లు వెలవడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.







