అక్రమంగా డబ్బును తరలిస్తున్న కారు అగ్నికి ఆహుతి అయింది.ఈ ఘటన వరంగల్ జిల్లాలోని బొల్లికుంటలో చోటు చేసుకుంది.
కారు ఇంజిన్ భాగంలోడబ్బు కట్టలను పెట్టి తరలిస్తుండగా మంటలు చెలరేగాయి.వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.అనంతరం కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అక్రమంగా డబ్బు కట్టలను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







