చిన్నతనంలో ఇబ్బందులు ఎదురైతే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువు కాదు.కల్పనా సరోజ్( Kalpana Saroj ) అనే మహిళ ప్రస్తుతం 930 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేస్తున్నారు.12 ఏళ్ల వయస్సులోనే కల్పనకు పెళ్లి జరగగా ఆమె అత్తింటి వేధింపులను ఎదుర్కొన్నారు.ఎన్నెన్నో కష్టాలు పడిన కల్పన ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ అందరూ గర్వించే స్థాయికి ఎదిగి ప్రశంసలు అందుకుంటున్నారు.1961 సంవత్సరంలో మహారాష్ట్రలోని( Maharashtra ) రోపర్ ఖేడా గ్రామంలో జన్మించారు.
కల్పన తండ్రి పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవారు.12 ఏళ్ల వయస్సులో పెళ్లి తర్వాత కల్పన ముంబైలోని మురికివాడలో( Mumbai Slum ) జీవనం సాగించారు.అత్తింటి వేధింపులు ఎక్కువ కావడంతో ఒకానొక సమయంలో కల్పన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.
ఆ తర్వాత కల్పన నెలకు 60 రూపాయల వేతనానికి చేరారు.ఆ తర్వాత 50,000 రూపాయల సాయం పొంది కల్పన బొటిక్ ను మొదలుపెట్టారు.

ఆ తర్వాత కల్పన కమాని ట్యూబ్స్( Kamani Tubes ) అనే సంస్థను మొదలుపెట్టారు.ప్రస్తుతం ఈ సంస్థకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఆదాయం వస్తోంది.కల్పనా సరోజ్ ఆస్తుల విలువ ఏకంగా 112 మిలియన్ డాలర్లు కావడం గమనార్హం.మన దేశంలోని కరెన్సీ లెక్కల ప్రకారం ఆమె ఆస్తుల విలువ 930 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
కల్పనా సరోజ్ ను చాలామంది నిజమైన స్లమ్ డాగ్ మిలియనీర్ అని పిలుస్తారు.

ఒకప్పుడు రోజుకు 2 రూపాయలు తీసుకునే స్థాయి నుంచి నేడు వందల మందికి జాబ్ ఇచ్చే స్థాయికి కల్పనా సరోజ్ ఎదిగారు.కష్టాలు ఎదుర్కొని సక్సెస్ సాధించాలని భావించే వాళ్లకు కల్పనా సరోజ్ స్టోరీ స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.కల్పనా సరోజ్ మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.
కల్పనా సరోజ్ సక్సెస్ స్టోరీ ఎంతో మందిలో స్పూర్తిని నింపుతుండటం గమనార్హం.







