హైకోర్టులో యూట్యూబర్ నాని పిటిషన్..

అమరావతి: హైకోర్టులో యూట్యూబర్ నాని పిటిషన్.విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్ల దహనం ఘటనకు సంబంధించి యూట్యూబర్ నానిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని ఈ ఘటనలో అతని ప్రమేయం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు.

 Vishakapatnam Harbour Fire Accident Youtuber Local Boy Nani Petition In High Cou-TeluguStop.com

ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు.విచారణ సోమవారానికి వాయిదా.లోకల్ బాయ్ నాని నేను ఏ తప్పూ చేయలేదు.19 రాత్రీ నేను వేరే ప్లేస్ లొ ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాను.9:46 నిమిషాలకు నాకు ఫోన్ వచ్చి యాక్సిండెంట్ స్పాట్ కు వెళ్ళాను.మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

నేను పార్టీ లో డ్రింక్ చేసి ఉన్న.డ్రింక్ చేసి నేను సేవ్ చెయ్యలేకపోయాను.గంగ పుత్రులకు సహాయం అందుతుంది అని విడియో తిసి పెట్టాను.22 సెకండ్స్ తీశాను నాకు డబ్బులు వస్తాయని నేను విడియో తియ్యలేదు.తీసిన విడియో 10 గంటలకు పోస్ట్ చేశాను.క్రైమ్ పోలీసులు ఫోన్ చేసి విచారణకు పిలిచారు.చిన్న ఎంక్వైరీ అని తీసుకుని వెళ్ళి నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నాడు.ఎందుకు ఆ పని చేశావ్ అని కొట్టారు.

బోట్లు నువ్వే తగల పెట్టావ్ అని కొట్టారు.నేను చెయ్యలేదని ఏడ్చాను.

నువ్వే చేశావ్ అని తిట్టారు.ప్రమాదం జరిగిన సమయంలో నేను ఎక్కడ ఉన్నానో కుడా సీసీ కెమెరాలో రికార్డు అయింది.

అన్ని చూసిన తర్వాత కూడా పోలీసులు నీ ఫ్రెండ్స్ తో నువ్వే చేశావ్ అని పోలీసులు అంటున్నారు.మరో 4 గురు అమయకులను కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు.

నేను కోర్ట్ కి రాకపోతే నన్ను ఏదో చేసేసేవారు.నేను చెయ్యకుండానే నేనే చేసినట్లు క్రియేట్ చేస్తున్నారు.

హై కోర్ట్ లో పిటిషన్ వెయ్యగానే నన్ను బెదిరించారు.హై కోర్ట్ లో న్యాయం జరుగుతుంది.

వైజాగ్ వెళ్ళాక నాపై ఎటాక్ కుడా చెయ్యొచ్చు.మా అన్న పై దాడి చేశారు రాళ్లతో కొట్టారు.

నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది.గంగ పుత్రులు నిజా నిజాలు తెలుసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube