ఆస్తులన్నీ ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధం..: బండి సంజయ్

కరీంనగర్ జిల్లాలోని బహుదూర్ ఖాన్ పేట, తాహెర్, కొండాపూర్ లలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన ఛాలెంజ్ విసిరారు.

 All Assets Are Ready To Be Written To The People..: Bandi Sanjay-TeluguStop.com

బియ్యం టెండర్లలో గోల్ మాల్ పై ప్రమాణం చేయడానికి సిద్దమా అని బండి సంజయ్ ప్రశ్నించారు.ఈ మేరకు రూ.1,300 కోట్లు గోల్ మాల్ జరిగిందని తాను నిరూపిస్తానన్నారు.అలాగే రేషన్ బియ్యం, వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానివేనని నిరూపిస్తానని తెలిపారు.

పంట నష్టపోయిన రైతులు గోస పడుతుంటే పంజాబ్ వాళ్లకు పైసలిస్తారా అని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తన ఆస్తులన్నీ ఈ క్షణమే ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

మంత్రి గంగులకు తన ఆస్తులను ప్రజలకు రాసిచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube