Movie Titles: టైటిల్ అర్ధం కాకపోయినా పర్లేదు అంటూ డిఫరెంట్ గా వస్తున్న స్టార్ హీరోస్

ఏదైనా సినిమా మొదలయ్యింది అంటే అన్నిటికన్నా ముందు జనాల్లోకి రీచ్ అవ్వాల్సింది కేవలం ఆ సినిమా యొక్క టైటిల్ మాత్రమే.అందుకే ఆ సినిమా టైటిల్ ఎలా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి అందరికీ అర్థమయ్యే విధంగా ఎన్నో ఎంతో మీనింగ్ ఉండేలా ప్లాన్ చేసేవారు నిన్న మొన్నటి వరకు మేకర్స్.

 South Heros And Their Latest Movie Titles Thangalaan Kanguva Salaar Thandel-TeluguStop.com

కానీ ఇప్పుడు ట్రెండు మారిపోయింది.టైటిల్ అర్దం కాకపోయినా పర్వాలేదు కానీ పవర్ ఫుల్ గా ఉండాలి, అలాగే డిఫరెంట్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పటి తరం దర్శకులు.

పైగా సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒకే భాషలో విడుదల పడలేదు.ఫ్యాన్ ఇండియావ్యాప్తంగా ఏదో ఒక రకంగా మంచి టైటిల్ సెలెక్ట్ చేసుకుంటూ జనాల్లోకి వెళుతున్నారు.

పైగా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలని కూడా ఫిక్స్ అయిపోవడం విశేషం.అలా ఈ మధ్యకాలంలో విభిన్నమైన టైటిల్స్ తో వచ్చి జనాల్లో బాగా ఆదరణ పొందుతున్న సినిమాలు ఏంటి ? ఆ సినిమాల టైటిల్స్ ఏంటో పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తండేల్

అక్కినేని వారి వారసుడు నాగచైతన్య( Naga Chaitanya ) వరుస 3 ఫ్లోపల తర్వాత తీస్తున్న సినిమా తండేల్.( Thandel ) ఈ సినిమా అతడికి మంచి విజయాన్ని సాధించాలని అలాగే పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరి దీని అర్థం ఏంటో తెలియదు కానీ చూడగానే కాస్త కొత్తగా, భిన్నంగా అయితే అనిపించింది.

Telugu Kanguva, Naga Chaitanya, Prabhas, Salaar, Strange, Surya, Thandel, Thanga

సలార్

ప్రభాస్( Prabhas ) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా( Salaar ) టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇదే రకమైన విభిన్న అభిప్రాయాలు అందరిలో వచ్చాయి.అసలు సలార్ అంటే ఏంటి ? దీనికి ఏమైనా అర్థం ఉందా ? అనే ప్రశ్న అందరిలో మొదలైంది.సినిమా తీస్తున్న టైం లోనే వర్కింగ్ టైటిల్ గా సలార్ అని పెట్టారు కానీ ఆ తర్వాత మార్చుతారు అని అందరూ అనుకున్న అదే టైటిల్ ని కన్ఫమ్ చేశాడు ప్రశాంత్ నీల్.

అర్థం తెలియకపోయినా కొత్తగా ఉంది కాబట్టి బాగానే వర్కౌట్ అయింది ఈ చిత్రానికి.

Telugu Kanguva, Naga Chaitanya, Prabhas, Salaar, Strange, Surya, Thandel, Thanga

తంగలన్

విక్రమ్( Vikram ) అంటేనే ప్రయోగానికి మారుపేరు.ఎలాంటి ప్రయోగాలు అయినా చేయడంలో మొదటి నుంచి అందవేసిన చేయిగా ఉన్న విక్రమ్ తంగలన్( Thangalaan ) అనే సినిమాతో చిత్ర విచిత్రమైన వేషధారణతో కఠినమైన మేకప్ తో ఎవరికి సాధ్యం కాని విధమైన కష్టంతో ఈ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి విక్రమ్ తో పాటు సినిమా టైటిల్ తంగలన్ కూడా విభిన్నంగానే ఉంటుంది.

Telugu Kanguva, Naga Chaitanya, Prabhas, Salaar, Strange, Surya, Thandel, Thanga

కంగువ

సూర్య( Surya ) కూడా మిగతా హీరోల్లాగానే భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తూ కంగువ( Kanguva ) అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఆ పేరు మాత్రం చాలా భిన్నంగా ఉంది.సూర్య 43వ సినిమా గా వస్తున్న కంగువ దాదాపు 2024 లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube