వైరల్: భర్తను స్వీట్‌హార్ట్ అంటే బాగోదంటూ వెయిట్రెస్‌కు వైఫ్ వార్నింగ్..

సాధారణంగా కొందరు భార్యలు తమ భర్త తమకే సొంతమని బాగా ఫీలవుతారు.ఇతర ఆడవాళ్లు భర్త వైపు చూసినా, లేదంటే కాస్త ప్రేమగా మాట్లాడినా వీళ్ళు అసలు తట్టుకోలేరు.

 Viral Wife Warns Waitress For Calling Her Husband A Sweetheart, Restaurant Bill,-TeluguStop.com

కొన్ని సందర్భాల్లో ఆడవారిపై గొడవ కూడా పెట్టుకుంటారు.అయితే తాజాగా ఒక రెస్టారెంట్ సర్వర్‌కు ఇలాంటి వైఫ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.

వెయిట్రెస్‌కు బిల్లులో టిప్పు ఇవ్వడానికి బదులుగా చివాట్లు పెట్టింది.ఆ రెస్టారెంట్ బిల్లు ఫొటో ఆన్‌లైన్‌లో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇప్పుడిది సర్వర్లు కస్టమర్‌లతో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి, కస్టమర్లు వారికి ఎలా టిప్ చేయాలి అనే దానిపై పెద్ద చర్చకు దారితీసింది.ఇమ్‌గుర్‌లో పోస్ట్ చేసిన ఒక ఫొటోలో టిప్ సెక్షన్‌లో అసభ్యకరమైన నోట్‌ రాసినట్లు కనిపించింది.ఆ బిల్లు కాస్ట్ $32.76 (సుమారు రూ.2,700) అయినట్లు ఉంది.నోట్‌లో, “నా భర్తను స్వీట్ హార్ట్ అని పిలవవద్దు” అని ఒక వార్నింగ్ రాసి ఉంది.

అంతేకాకుండా ఎలాంటి టిప్ అందించలేదు.ఈ ఫొటోకు “సరే, ఇది ఒక టిప్ కావచ్చు, కానీ ఆమె తన చిన్ని పొట్ట నింపుకోవడానికి ప్రయత్నిస్తోంది.” అని ఒక క్యాప్షన్‌ రాశారు.ఈ సంఘటన ఏ సమయంలో ఎలా జరిగిందో వివరించలేదు.

Telugu Tip, Restaurant, Rude, Server, Sweetheart-Latest News - Telugu

ఫొటోపై ఇమ్‌గుర్ యూజర్లు( Imgur users ) రకరకాలుగా కామెంట్లు చేశారు.భార్య ప్రవర్తన, సర్వర్ వ్యవహారశైలి, టిప్పింగ్ సంస్కృతిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.కొంతమంది యూజర్లు భార్య చాలా ఇన్‌సెక్యూర్‌గా ఉందని అన్నారు.సర్వర్‌ బహుశా మర్యాదగా, ఫ్రెండ్లీగా ఉండటానికి అలా పిలిచి ఉండొచ్చని అన్నారు.మరికొందరు టిప్పింగ్‌ను రద్దు చేయాలని, యజమానులు తమ సిబ్బందికి తగినంత శాలరీ ఇవ్వాలని సూచించారు.సర్వర్లు తమ ఆదాయం కోసం కస్టమర్ల దాతృత్వం లేదా మూడ్‌ పై ఆధారపడకూడదని వారు వాదించారు.

Telugu Tip, Restaurant, Rude, Server, Sweetheart-Latest News - Telugu

కొన్ని ప్రాంతాలలో సర్వర్లు లింగం లేదా రిలేషన్ షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా అందరినీ “హనీ “, “స్వీటీ” లేదా “స్వీట్‌హార్ట్” వంటి వర్డ్స్‌తో పిలవడం కామన్ అని మరికొందరు అన్నారు.ఇలాంటి సర్వర్లను తప్పు పట్టకుండా మర్యాదపూర్వకంగా ఉండాల్సిన బాధ్యత కస్టమర్లకు ఉందని పేర్కొన్నారు.మొరటుగా లేదా అనుచితంగా ప్రవర్తించినంతవరకు సర్వర్‌లు ఈ పేర్లతో పిలిచినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు.కొంతమంది మాత్రం, అపరిచితులు ఈ పేర్లతో పిలవడం తమకు ఇష్టం ఉండదని ఒప్పుకున్నారు, కానీ ఇలా టిప్ ఇవ్వకుండా తిట్టడం ఏం బాగోలేదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube