కమలం పార్టీ రథ సారధి కిషన్ రెడ్డి ( Kishan reddy ) ప్రస్తుతం ప్రచారంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు.ఈటెల రాజేందర్,బండి సంజయ్ వంటి నాయకులు వేరే నియోజకవర్గాల్లోకి వెళ్లి కమలం పార్టి తరఫున ప్రచారం చేస్తున్నారు.
కానీ అసలు పార్టీ అధ్యక్షుడు జనాల్లోకి రాకపోవడంతో రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది.ఎందుకు కిషన్ రెడ్డి జనాల్లోకి రావడం లేదు.
కేవలం గ్రేటర్ హైదరాబాద్ వరకే పరిమితం అవ్వడం వెనుక అసలు కారణం ఏంటి.అంటూ ఇలా ఎవరికి వారు చెవులు కొరుక్కుంటున్నారు.
బండి సంజయ్ ( Bandi sanjay ) బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజెపి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తూ రాష్ట్రమంతటా మంచి పేరు తెచ్చుకుంది.
కానీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడో అప్పటినుండి బిజెపి ( BJP ) డల్ అవుతూ వస్తుంది.ప్రస్తుతం తెలంగాణలో బిజెపి పతనావస్థలో ఉంది.ఇక ఎన్నికలకు వారం రోజులు కూడా లేవు.
ఇతర పార్టీల అధ్యక్షులు క్షణం కూడా తీరిక లేకుండా రాష్ట్ర మొత్తం చుట్టేస్తుంటే కిషన్ రెడ్డి మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మినహా ఏ నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభలు పెట్టి పార్టీ తరఫున ప్రచారం చేయడం లేదు.అలాగే తమ మేనిఫెస్టోని ప్రజల్లోకి వెళ్లేలా కూడా ప్రచారం చేయడం లేదు.
దీంతో కిషన్ రెడ్డి తీరుపై బీజేపీ కార్యకర్తలతో పాటు పార్టీ అధిష్టానం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఇతర పార్టీల నాయకులు రాష్ట్రం మొత్తం చుట్టేస్తు వారి మేనిఫెస్టోని, అలాగే అధికారంలోకి వస్తే చేయబోయే పనులన్నింటిని ప్రజల్లో బలంగా నాటుకు పోయేలా ప్రచారాలు చేస్తున్నారు.
కానీ కమల రథసారధి కిషన్ రెడ్డి మాత్రం ఒక్క నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభ పెట్టి పార్టీ గురించి ప్రచారం చేయకపోవడంతో సొంత పార్టీ నేతలే ఈయనపై విమర్శలు చేస్తున్నారు.ఇక ఇంకొంతమంది ఇతర పార్టీ వాళ్ళయితే ఎలాగూ ఓడిపోతాం కదా ఎందుకు రాష్ట్రమంతా తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం అని భావిస్తున్నారు కావచ్చు అందుకే హైదరాబాద్ ( Hyedrabad ) వదిలి ఎక్కడికి రావడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.