కెనడియన్ పౌరులకు ఈ-వీసా సేవలు పునఃప్రారంభించిన భారత్.. 2 నెలల తర్వాత అందుబాటులోకి

ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Canadian Prime Minister Justin Trudeau )చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.

 India Resumes E-visa Services For Canadian Nationals After 2-month Pause , Canad-TeluguStop.com

ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.

ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

Telugu Canadianprime, Visa, Electron Visa, Externalaffairs, Indian Canada, Delhi

అయితే భారత్ వీసాలను నిలిపివేయడంతో అత్యవసర పనుల నిమిత్తం మనదేశానికి రావాల్సిన కెనడియన్లు, ప్రవాస భారతీయులు , వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.దీనిపై భారీగా ఫిర్యాదులు సైతం రావడంతో కేంద్ర విదేశాంగ శాఖ , కెనడాలోని ఇండియన్ హైకమీషన్ ( Indian High Commission in Canada )స్పందించింది.కెనడాలో నిలిపివేసిన అన్ని రకాల వీసా సేవలను అక్టోబర్ 26 నుంచి పున: ప్రారంభించనున్నట్లుగా తెలిపింది.తాజాగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.దాదాపు రెండు నెలల విరామం తర్వాత కెనడియన్ పౌరులకు ఎలక్ట్రాన్ వీసా( Electron Visa ) (ఈ వీసా) సేవలను పునరుద్దరించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

కెనడా భూ భాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని న్యూఢిల్లీ( New Delhi ) ఇప్పటికీ ట్రూడో ప్రభుత్వాన్ని కోరుతూనే వుంది.

Telugu Canadianprime, Visa, Electron Visa, Externalaffairs, Indian Canada, Delhi

నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ఆరోపణలను తాము తోసిపుచ్చడం లేదని , అలాగే కెనడా దర్యాప్తును కూడా తాము వ్యతిరేకించడం లేదన్నారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( External Affairs Minister Dr S Jaishankar ).అయితే ఈ వాదనలకు అనుగుణంగా బలమైన సాక్ష్యాలు తమ ముందు పెట్టాలని ఆయన పేర్కొన్నారు.ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన జైశంకర్ .ప్రముఖ జర్నలిస్ట్ లియోనెల్ బార్బర్‌తో ‘‘ హౌ ఎ బిలియన్ పీపుల్ సీ ది వరల్డ్ ’’ అనే శీర్షికతో జరిగిన సంభాషణ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.తన ఆరోపణలకు మద్ధతు ఇచ్చే ఎలాంటి ఆధారాలను భారత్‌తో కెనడా పంచుకోలేదని జైశంకర్ పేర్కొన్నారు.

కెనడాలో ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలను ప్రస్తావిస్తూ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక నిర్దిష్ట బాధ్యతతో వస్తాయన్నారు.ఆ స్వేచ్ఛలను దుర్వినియోగం చేయడం , రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగాన్ని సహించడం చాలా తప్పు అని జైశంకర్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube