అనంతపురంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చంద్రశేఖర్ రెడ్డిపై తాడిపత్రి సెబ్ పోలీసుల దాడిని ఖండిస్తున్నామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.
అక్రమ మద్యం సరఫరా చేసే వారిని వదిలి అమాయకులపై ప్రతాపం చూపిస్తున్నారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ముద్దాయి ఎవరో తెలియకుండా పోలీసులు దాడి చేసి గాయపర్చడం సెబ్ పనితీరుకు అద్దం పడుతోందని మండిపడ్డారు.ఈ మేరకు గాయపడిన చంద్రశేఖర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
అదేవిధంగా బాధ్యులైన సెబ్ పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.







