మీ కురులు చాలా బలహీనంగా ఉన్నాయా.. అయితే ఈ హెయిర్ టానిక్ మీ కోసం!

సాధారణంగా కొందరి కురులు చాలా బలహీనంగా ఉంటాయి.రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్‌ టూల్స్ వాడటం, పోషకాల కొరత, కాలుష్యం తదితర కారణాల వల్ల జుట్టు బలహీనంగా మారుతుంటుంది.

 Using This Tonic Will Strengthen The Hair , Hair Tonic, Latest News , Hair-TeluguStop.com

దీంతో హెయిర్ ఫాల్( Hair fall ) మరియు హెయిర్ డ్యామేజ్ వంటి స‌మ‌స్య‌లు అధికంగా పెరుగుతాయి.ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో తెలియక హైరానా పడిపోతున్నారా.

టెన్ష‌న్‌ వద్దు.ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ హెయిర్ టానిక్ ను కనుక వాడితే ఎంతటి బలహీనమైన కురులు అయినా సరే కొద్ది రోజుల్లోనే బలోపేతం అవుతాయి.

మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Care, Care Tips, Damage, Fall, Tonic, Healthy, Latest-Telugu Health

ముందుగా ఒక కలబంద( Aloe vera ) ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్‌ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు( Sesame seeds ) మ‌రియు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ( Fenugreek )వేసి మరిగించాలి.

ఆల్మోస్ట్ వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) ను మిక్స్ చేయాలి.

దాంతో హెయిర్ టానిక్( Hair tonic ) రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ తీసుకుని తయారు చేసుకున్న హెయిర్ టానిక్ ను నింపుకోవాలి.

Telugu Care, Care Tips, Damage, Fall, Tonic, Healthy, Latest-Telugu Health

ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి బాగా స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను( Mild shampoo ) ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేస్తే కురులు బలోపేతం అవుతాయి.బలంగా మారతాయి.హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ సమస్యలు దూరం అవుతాయి.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరియు తెల్ల జుట్టు సైతం త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube