రోజుకు రెండు యాలకులతో.. ఇలా చేస్తే వైద్యుడితో పనే ఉండదు..!

ముఖ్యంగా చెప్పాలంటే మన ఇళ్లలో లభించే సుగంధ ద్రవ్యాలు ఔషధపరంగా కూడా ఎన్నో గుణాలను కలిగి ఉంటాయి.అలాగే పసుపు,లవంగం వంటివి రుచితో పాటు ఆరోగ్యం పై కూడా ప్రత్యేకంగా పని చేస్తాయి.

 With Two Yams A Day.. If You Do This, It Will Not Work With The Doctor , Spice-TeluguStop.com

ఈ సుగంధ ద్రవ్యాలలో యాలకులు( Elaichi ) కూడా ఎంతో ముఖ్యమైనవి.వీటిని రెగ్యులర్ తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం,( Constipation ) కడుపునొప్పివంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

అలాగే యాలకులు తీసుకోవడం వల్ల దంత క్షయం నుంచి ఉపశమనం లభిస్తుంది.నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.

అంతేకాకుండా వాంతులు, వికారం లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే యాలకులు పురుషుల శరీర సామర్థ్యాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

Telugu Acidity, Cancer, Clove, Elaichi, Problems, Tips, Heart-Telugu Health Tips

వాస్తవానికి ఇది కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.మగవారు రాత్రి నిద్రపోయే ముందు కనీసం రెండు యాలకులు నోట్లో వేసుకొని నమలాలి.రాత్రి నిద్రపోయే ముందు రెండు యాలకులను ఒక గ్లాసు పాలలో వేసి వేడి చేసి తాగితే లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మగవారిలో నపుంసకత్వము తొలగిపోతుందని చెబుతున్నారు.

రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు యాలకులను వేసి మరిగించాలి.ఈ నీటిని తాగి యాలకులను నమలాలి.

ఇలా చేయడం వల్ల యాలకులు మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తాయి.

Telugu Acidity, Cancer, Clove, Elaichi, Problems, Tips, Heart-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే క్యాన్సర్( Cancer ) ను దూరం చేయడంలో యాలకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే యాలకులు క్యాన్సర్ నిరోధక గుణాల తో నిండి ఉన్నాయి.ఇవి క్యాన్సర్ కణాలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

యాలకులను ప్రతి రోజు నోట్లో వేసుకొని నమలడం వల్ల క్యాన్సర్ నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే మీ ఆహారంలో యాలకులను చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల( Heart disease ) నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాగే యాలకుల వినియోగం గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube