తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బిజెపి బాగా వెనకబడిందని, ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్యనే ఉందని ఇప్పటికే అనేక సర్వే ల్లో తేలింది.దీనికి తగ్గట్లుగానే ఎన్నికల ప్రచారంలోనూ కాస్త బిజెపి వెనుకబడింది.
చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించలేకపోయింది.దీంతో జనాల్లోనూ తెలంగాణలో ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అన్నట్లుగా చర్చ జరుగుతుంది.
బిజెపి అగ్ర నేతల నుంచి , రాష్ట్రస్థాయి నాయకుల వరకు అంతా ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నా, ఎన్నికల్లో కమలం పార్టీకి నిరాశ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.అయినా తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమా ను బిజెపి వ్యక్తం చేస్తుంది.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో బిజెపికి అంతగా పట్టు లేదు.అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్( Congress, BRS ) బలంగా ఉన్నాయి.
అయినా బిజెపి ధీమా వెనక కారణం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.

జనాల్లోనూ, రాజకీయ వర్గాలలోను ఈ రకమైన చర్చ జరుగుతున్నా, బిజెపి( BJP ) ధీమాగా ఉండడంతో, అసలు ఆ పార్టీ ధీమా వెనక కారణాలు ఏమిటి అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ ప్రభావం కనిపిస్తోంది.కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకోగా, మరికొన్ని జిల్లాలో బీఆర్ఎస్ తిరిగి తమ స్థానాలను దక్కించుకుంటుందని సర్వే నివేదికల్లో తేలిందట.
అదే బిజెపి ఆశలకు కారణంగా తెలుస్తోంది.ప్రస్తుతం అందుతున్న సర్వే నివేదికల ప్రకారం హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే , తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలకు మేజిక్ ఫిగర్ రాకపోతే, తామే కింగ్ మేకర్ అవుతామని బిజెపి అంచనా వేస్తోంది .

కేసిఆర్( CM KCR ) ఎలాగూ కాంగ్రెస్ తో కలిసే ఛాన్స్ లేదని, ఆయన బిజెపి వైపే మొగ్గు చూపుతారని బిజెపి అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారట.అందుకే బిజెపి తక్కువ స్థానాల్లో గెలిచినా, అధికారంలోకి వస్తుందనే ధీమా కు కారణమట.అందుకే తమ పార్టీ ఎంపీలను సైతం ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బిజెపి దింపిందట.







