తాను ప్రాణాలతో బ్రతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం గానే ఉంటుందని ఇక్కడ మతకల్లోలకు మతఘర్షణలకు అవకాశం లేదంటూ సీఎం కేసీఆర్( CM KCR ) చెప్పుకొస్తున్నారు .దాదాపు తన ప్రతి ఎన్నికల సభ లోనూ ఈ విషయాన్ని లేవనెత్తుతున్న కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా మతఘర్షణల కారణంగా కర్ఫ్యూ విధించబడలేదని, శాంతి భద్రతలకు తామెంత ప్రాధాన్యత ఇస్తామో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని, పేదలకు అత్యంత మేలు జరిగింది, దేశంలో చెప్పుకోదగ్గ మార్పులన్నీ ఇందిరమ్మ రాజ్యంలోనే వచ్చాయని అందువల్ల తాము ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
ప్రజల సంపదలను ప్రజలకు పంచడమే ధ్యేయంగా కాంగ్రెస్ పని చేస్తుందని, ఇందిరమ్మ హయాంలో గరీబీ హఠావో నినాదంతో పేదరికం నిర్మూలించడానికి ప్రయత్నాలు జరిగాయని, అంతేకాకుండా బ్యాంకులను జాతీయికరణ చేయడం, కాలవలు తవ్వించడం ,రాజ్యబరణాలను రద్దు చేయడం వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు ఇందిరమ్మ( Indira Gandhi ) నాంది పలికిందని మరోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడం ద్వారా పేదరికం దూరం చేసే ప్రయత్నాలు చేస్తామని కాంగ్రెస్ నేతలు వాదన .అయితే అసలు ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ( Telangana ) అనేక ఇబ్బందులకు గురైందని 1969 ఉద్యమంలో తెలంగాణలో విద్యార్థులను కాల్చి చంపడం ఇందిరమ్మ హయం లోనే జరిగిందని.
అసలు తెలంగాణను పోగొట్టింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అని కేసీఆర్ రీటార్ట్ ఇస్తున్నారు.ఇలా లౌకిక రాజ్యం ఇందిరమ్మ రాజ్యాలకు తమ తమ అర్థాలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ శ్రేణులు అంతిమంగా ప్రజలను ఏ రాజ్యం దిశగా తీసుకువెళ్తారు చూడాలి.ఇరుపార్టీలు పూర్తి స్తాయి బలా బలాలను ప్రయోగించడం కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టి అగ్ర స్తాయి నేతలు ప్రచారం చేయడం తో తెలంగాణ లో గాలి ఏ పార్టీకి అనుకూలం గా ఉంది అన్న విషయం లో ఇప్పటికీ స్పష్టమైన సంకేతాలు కనబడటం లేదు .