యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలోని వివేకానంద, భగత్ సింగ్ విగ్రహాల ముందున్న గేట్ వాల్ గత ఏడాది నుండి పై కప్పులేక ఓపెన్ గా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నా పాలక మండలికి ఇది పట్టకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.మునుగోడు ఉప ఎన్నికలు ముగిసి,సాధారణ ఎన్నికలు వచ్చాయని, కానీ, సమస్యను పరిష్కరించేవారు లేరని వాపోతున్నారు.
ప్రజా సమస్యలను గాలికొదిలి, మళ్ళీ గెలుపు కోసం అన్ని పార్టీలు ప్రచారంలో తిరుగుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాత్రిపూట గేట్ వాల్ కప్పు లేకుండా ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కార్లు, బైక్స్ వేగంగా వచ్చి గేట్ వాల్ కి తగిలి పడిపోతున్నాయని, కనీసం ఎన్నికల పేరుతోనైనా ఎవరో ఒకరు ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.







