ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా అలాగే సినిమాలు విడుదల అయ్యి కొన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటికే విడుదలైన సినిమాలను థియేటర్లలో మళ్ళీ రీ రిలీజ్( Re-Release Movies ) చేస్తున్నారు.
సూపర్ హిట్ సినిమాలను మాత్రమే కాకుండా ఫ్లాప్ గా నిలిచిన సినిమాలను కూడా థియేటర్ లలోకి విడుదల చేస్తున్నారు.అలా ఇప్పటికే చిరంజీవి,బాలకృష్ణ, పవన్ కళ్యాణ్,రామ్ చరణ్, జూనియర్,ఎన్టీఆర్ ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

తరచూ ఏదో ఒక సినిమా రీ రిలీజ్ అవుతూనే ఉంది.అయితే బోలెడు ఆశలతో సినిమాలను రిలీజ్ చేసినప్పటికీ అందులో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాగా కలెక్షన్లను సాధిస్తున్నాయి.మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు( Superhit Movies ) ఇప్పుడు ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.
బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల పరువు తీస్తున్నారు అభిమానులు.అయితే సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ మూవీ మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

దీంతో ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్న సినిమాలు రీ-రిలీజ్ లో అట్టర్ ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి.అయితే ప్రేక్షకులు అభిమానులు కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా పూర్తిస్థాయిలో థియేటర్లకు ( Theaters ) రావడం లేదు.దీంతో ఒకప్పుడు కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన ఆ సినిమాలు ప్రస్తుతం కేవలం వేలలో వసూళ్లను రాబడుతున్నాయి.ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా యోగి సినిమాను( Yogi Movie ) రీ రిలీజ్ చేయగా కనీసం అభిమానులు కూడా ఆ సినిమాను పట్టించుకోలేదు.
అలా ఇప్పటివరకు ఒక యోగి సినిమా మాత్రమే కాకుండా బిల్లా,( Billa ) ఆంధ్రావాలా,( Andhrawala ) గుడుంబా శంకర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అదుర్స్ లాంటి సినిమాలు దారుణమైన కలెక్షన్స్ ని రాబట్టాయి.







