విజయవాడలో కార్ రేసింగ్ కలకలం సృష్టించింది.జాతీయ రహదారి రమేశ్ ఆస్పత్రికి సమీపంలో రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఢీకొట్టింది.
కారు ఢీకొట్టిన దాటికి స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయాయని తెలుస్తోంది.ఈ ఘటనలో స్కూటీలపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రేసింగ్ నిర్వహించిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా బెంజ్ ఫార్చునర్ కారులో కొందరు యువకులు, యువతులు కలిసి రేసింగ్ నిర్వహించారని తెలుస్తోంది.







