ప్రస్తుతం వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల( Chemical fertilizers ) వినియోగం బాగా పెరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ అధిక రసాయనిక మందులతో పండిన కూరగాయలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అందుకే కొంతమంది తమ ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే పెరటి తోటలను పెంచి నాణ్యమైన కూరగాయలను పండించుకుని ఆహారంగా తీసుకోవాలని అనుకుంటున్న సంగతి కూడా తెలిసిందే.సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటల నుంచి వచ్చిన ఆహారాన్ని తీసుకుంటేనే ఆరోగ్యం సొంతం అవుతుంది.
కాబట్టి చాలామంది కేవలం పశువుల ఎరువు, కంపోస్ట్ ఎరువులను( Cattle manure , compost fertilizers ) మాత్రమే తమ పెరటి తోటల్లో పెంచే మొక్కలకు అందిస్తున్నారు.

వంటింటి వ్యర్ధాలను అనవసరంగా పారేస్తున్నారు.ఈ వ్యర్ధాలను పారేయకుండా మొక్కలకు అందిస్తే ఎన్నో పోషకాలు మొక్కలకు సంపూర్ణంగా అంది నాణ్యమైన పంట దిగుబడి ఇస్తాయని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.వ్యవసాయ వ్యర్థాలను మొక్కలకు కావలసిన పోషకాల రూపంలోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
అన్నం, కూరలు, పప్పు ( Rice, curries, pulses )లాంటి ఆహార పదార్థాలు మిగిలిపోతే పాడయ్యకుండా మొక్కలకు అందించాలి.అన్నం ను గ్రైండ్ చేసి ఒక బకెట్ నీళ్లలో కలిపి మొక్కలకు పోయాలి.
పుల్లగా మారిన మజ్జిగ ను నీళ్లలో కలిపి మొక్కలకు పోయాలి.మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేసి ఆ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి.

బియ్యం, కూరగాయలు లాంటిని కడిగిన నీటిని సింక్లోపోయకుండా మొక్కలకు పోయాలి.ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా కాసేపు నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోయాలి.అలాగే అరటి తొక్కలను కూడా పాడేయకుండా కాసేపు నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పొయ్యాలి.ఇలా వంటింట్లో ఉండే వ్యర్థ ఆహార పదార్థాలను అనవసరంగా పాడేయకుండా నీళ్లలో కలిపి మొక్కలకు అందిస్తే.
ఫాస్పరస్, పొటాషియం, నైట్రోజన్ మొక్కలకు పుష్కలంగా అందుతాయి.పైగా వంటింటి వ్యర్థాలను నీళ్లలో పోసి మొక్కలకు వేయడం వల్ల మొక్కలు చూడడానికి కూడా ఆరోగ్యకరంగా కనిపిస్తాయి.
దీంతో ఇతర అనవసర ఎరువుల వినియోగం చాలావరకు తగ్గుతుంది.







