తెలంగాణలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఈ మేరకు గద్వాలలో బీజేపీ సకల జనుల సంకల్ప సభకు ఆయన హాజరయ్యారు.
జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.70 కోట్లు కేటాయించిందని అమిత్ షా తెలిపారు.జోగులాంబ ఆలయ అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు.కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేదన్న అమిత్ షా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని తెలిపారు.కేసీఆర్ అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.గద్వాలలో పేదలకు కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదన్న ఆయన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని చెప్పారు.బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని స్పష్టం చేశారు.







