విశాఖపట్నంలో వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా మంత్రి గుడివాడ్ అమర్నాథ్ మాట్లాడుతూ బస్సు యాత్రకు విశేషమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు.
వైసీపీ చేసిన మంచిని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చెప్తున్నామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.టీడీపీ హయాంలో విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఆరోపించారు.
బడుగు, బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్ అన్న మంత్రి అమర్నాథ్ సామాజిక న్యాయం సైతం జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







