ఏపీలో వైసిపి ప్రభుత్వంపై( YCP ) ) ఉమ్మడి పోరు నిర్వహించేందుకు నిర్ణయించుకున్న టిడిపి , జనసేన పార్టీలు(TDP Janasena parties ) మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాయి.రెండు పార్టీలు పొత్తు తర్వాత ఉమ్మడి కార్యాచరణను అమలు చేసేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఈరోజు నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.
రెండు పార్టీల కేడర్ తో కలిసి ముందుకు వెళ్లేలా ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.మినీ మేనిఫెస్టో కూడా సిద్ధం కావడంతో ఇక పూర్తిగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూలత లేకుండా చేయాలని, ఉద్యమాల ద్వారా ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే ఆలోచనతో ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నాయి .ఈ మేరకు రాష్ట్రస్థాయిలో జేఏసీ ఏర్పాటు , జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు నియోజకవర్గస్థాయిలో ఆత్మీయ సమావేశాలతో రెండు పార్టీల నాయకులను ఒక తాటిపైకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు.

చాలా నియోజకవర్గాల్లో చిన్న చిన్న గొడవలు జరిగినా, సర్దుకుంటాయనే నమ్మకంతో ఉన్నారు .ఇక ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు .మరోవైపు 15 రోజులకు ఒక సమస్యపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు , రేపు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు .నాయకులు , జేఏసీ పిలుపుతో ఈరోజు , రేపు ఇరు పార్టీల నాయకులు కలిసి ఉమ్మడిగా పోరాటాలు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు దారేది పేరుతో ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి డిజిటల్ క్యాంపెయిన్ చేయనున్నారు.ఈ కార్యక్రమం తర్వాత రైతుల ఇబ్బందులు, రాష్ట్రంలో కరువు, కరెంటు చార్జీల పెంపు నిత్యవసరాల ధరలు, ఇసుక సరఫరా ,మద్యం అమ్మకాల్లో అక్రమాలు, యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం వంటి సమస్యల పైన పోరాడేందుకు రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.







