తూర్పుగోదావరి జిల్లా: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని బుర్రిలంక- వేమగిరి ఇసుకర్యాంపు పరిశీలించారు.ఇసుక ర్యాంపు కు వచ్చే వాహనాల రద్దీ వల్ల తమ పంట పొలాలు, నర్సరీలు నాశనమైపోతున్నాయని పలువురు రైతులు మొరపెట్టుకున్నారు.
రైతుల ఇబ్బందులు విన్న పురందేశ్వరి ఘాటుగా స్పందించారు.ఇసుక దోపిడీతో రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు.
ఇసుక నిల్వలు అపారంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో అదే స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తదాంతో వెల్లువెత్తడంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి స్వయంగా ఇసుకరాంపు పరిశీలించడానికి బుర్రిలంక విచ్చేశారు.ఇసుక ర్యాంపు పరిస్థితిని గమనించారు.
నిత్యం వందల లారీలు భారీ వాహనాలు ఆ రహదారిలో తిరగుతు మట్టి ఇసుక దోపిడీ చేయడంతో రోడ్డు చిద్రమైందని రైతులు ఆ రోడ్డు గుండా వెళ్లాలంటేనే నరకం చూస్తున్నారన్నారు.వాహనాలు అడ్డదిడ్డంగా వెళుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం రైతులకు కాకుండా ఇసుక నిర్వహకుల కోసం పనిచేస్తున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.