ఇప్పుడు అంటే సినిమా అంటే 50 కోట్ల 100 కోట్ల అని అడుగుతున్నారు.కానీ అప్పట్లో ఓ సినిమా అంటే ఐదు లక్షలు 10 లక్షలు మాత్రమే ఉండేది.
అక్కినేని, ఎన్టీఆర్( NTR , ANR ) సినిమా లు తీస్తున్న సమయంలో సినిమా కోటి రూపాయలు దాటితే అది చాలా పెద్ద విషయం.అప్పట్లో అది బాహుబలి తో సమానమైన సినిమాగా భావించేవారు.
అయితే కె.వి.రెడ్డి మాయాబజార్ అనే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు దానిని నాగిరెడ్డి, చక్రపాణిలు కలిసి నిర్మాణం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.మాయాబజార్ స్క్రిప్ట్ వారికి చాలా నచ్చింది.
దాంతో ఆ స్క్రిప్ట్ కి సంబంధించిన బడ్జెట్ ను కూడా వేయమని చెప్పారట.పింగళితో కలిసి కె.
వి.రెడ్డి ఆ సినిమా బడ్జెట్ ను పూర్తి చేసి ప్రొడ్యూసర్ల ముందు పెట్టారట.

కె.వి.రెడ్డి( K V Reddy ) బడ్జెట్ మరియు సినిమా విషయంలో ఎంత ఆచితూచి అడుగులు వేస్తారంటే ఆయన స్క్రిప్టును చూసి అది ఎన్ని అడుగుల ఫిలింతో తీయవచ్చు ఖచ్చితంగా అంచనా వేయడంలో దిట్ట అని చెప్తుంటారు.అంతేకాదు ఒక్కొక్క పాత్ర డైలాగ్ తో సహా లెక్కలు వేసి టేబుల్ పై పెట్టగలగడంలో కేవీరెడ్డి తర్వాతే ఇండస్ట్రీలో ఎవరైనా అని అప్పట్లో చెప్పేవారు.
దాంతో స్క్రిప్ట్ చూసి కె.వి.రెడ్డి మాయాబజార్ సినిమాకి 24 లక్షల బడ్జెట్ అవుతుంది అని తేల్చారు.కానీ అప్పట్లో 24 లక్షలు అంటే చాలా పెద్ద విషయం.
అప్పుడు అంతా అయిదు లక్షల కు మించి సినిమాలు తీసేవారు కాదు.ఇక ఈ చిత్రంలో అభిమన్యుని పాత్ర కోసం అక్కినేని అనుకున్నారట.

అయితే బడ్జెట్ బాగా పెరగడంతో నాగిరెడ్డి ( Nagireddy )ఈ సినిమాను కొన్నాళ్లపాటు వాయిదా వేయాలనుకున్నాడు కానీ అక్కినేని సామాన్యుడు కాదు కదా ఆయన లౌక్యం తెలిసిన విషయం మనిషి కానీ తను ఈ సినిమా వాయిదా పడకూడదన్న విషయాన్ని నిర్మాతల ముందు బయటపడకుండా ఒక తమిళ నిర్మాతతో సినిమా చేయాలని అతన్ని కలిసాడట.అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఆ నిర్మాతతో నాగిరెడ్డికి ఫోన్ చేయించాడు.మాయాబజార్ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్ కూడా అక్కినేని నీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు, నాతో కలిసి సినిమా చేస్తానన్నాడని చెప్పించాడట.దాంతో ఆలోచనలో పడ్డ నాగిరెడ్డి, చక్రపాణి ఇక లాభం లేదు అనుకొని మాయాబజార్ సినిమాను ప్రారంభించారు.
ఆ తర్వాత ఆ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో, ఎలాంటి చరిత్ర సృష్టించిందో మనకు తెలిసిన విషయమే.







