ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పినపాకలో రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలతో పాటు మ్యానిఫెస్టోను అమలు చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.పదేళ్లుగా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించిన ఆయన రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు అంతం పలికే రోజు వచ్చిందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తాను స్వయంగా వెళ్లి చూశానన్నారు.ఈ ప్రాజెక్టుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.ధరణి పేరుతో భూములు లాక్కున్నారన్న రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.







